Rs 90 to a Dollar: ప్రపంచ మార్కెట్‌ను డాలర్ శాసిస్తోంది. అందుకే అని దేశాలు డాలర్‌తో తమ కరెన్సీని పోల్చుకుంటాయి. అయితే డాలర్‌కు ప్రయత్నామ్నాయ కరెన్సీ కోసం పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. యూరో తెచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు చైనా, రష్యా, భారత్ కూడా ప్రత్యామ్నాక కరెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాల మధ్య వైరుధ్యాల కారణంగా కార్యరూపం దాల్చడం లేదు. ఇదిలా ఉంటే అమెరికా కరెన్సీ డాలర్ దూకుడు పెంచుతోంది. తాజాగా డాలర్ దెబ్బకు భారత రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 90.14 వరకు పడిపోయింది. మంగళవారం 89.96 వద్ద ముగిసినప్పటికీ, బుధవారం ఉదయం 10 గంటల సమయంలో 90.12 వద్ద ట్రేడ్ అవుతోంది.
క్షీణతకు కారణాలు
దిగుమతులకు డాలర్ కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ పెరగడం రూపాయి బలహీనతకు ప్రధాన కారకాలు. భారత–అమెరికా వాణిజ్య చర్చల సందిగ్ధత, విదేశీ మదుపరుల లాభాలు స్వీకరణ మరింత ఒత్తిడి పెంచాయి. ఇలా కొనసాగితే 91 వరకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయ మార్కెట్‌పై ప్రభావం
సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 25,928 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యోల్బణ సమీక్ష డిసెంబర్ 5న ప్రకటించనుంది. వడ్డీ రేట్ల కోత అవకాశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.
రెండు మూడు రోజుల క్రితం.. మన జీడీపీ పెరిగందని గొప్పగా చెప్పుకున్నాం.. అమెరికా ఆంక్షలు ఉన్న.. మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని సంబరపడ్డాం. కానీ తాపా పరిణామాలు.. భారత్‌ను షాక్‌కు గురిచేశాయి. రూపాయి విలువ రికార్డుస్థాయిలో పడిపోయింది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి. రూపాయి పతనంతో మరింత దిగజారే పరిస్థితి.