Government funds credited: మరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గత పంటకు సంబంధించిన ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తున్నామని ఆయన అన్నారు. రైతులపై ప్రేమ ఉన్నందువలనే నిబద్ధతతో ధాన్యం సేకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నామని అంటున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాఫ్ లో 41.6 ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ ధాన్యం సేకరణకు సంబంధించిన డబ్బులు రూ.7,887 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించామని అన్నారు. ఈ డబ్బులు ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో వేశామని అన్నారు.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అత్యధికంగా ధాన్యం సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 11.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించారని.. తెలంగాణలో మాత్రం అందుకు నాలుగు రేట్లు అధికంగా 41. 6 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణలో 7.5 లక్షల మంది రైతులకు నేరుగా ధాన్యం చెల్లిస్తే.. ఆంధ్రప్రదేశ్లో 1.7 లక్షల మంది రైతులకు రూ.2,830 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో సన్నారకం ధాన్యానికి అదనంగా బోనస్ ను రూ.314 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ప్రకటించిన తర్వాత చాలామంది రైతులు ఈ రకమైన పంటను వేశారని.. రైతులను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
గతంలో కంటే ఇప్పుడు సన్నరకం పంట విస్తీర్ణం పెరిగిందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణలో అత్యధిక ప్రగతి సాధించిందని అంటున్నారు. ఓవైపు ధాన్యం వేగంగా సేకరించడంతోపాటు మరోవైపు వారికి డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు.
ధాన్యం సేకరణలో మాత్రమే కాకుండా రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఈ విషయంలోనూ కూడా ఎక్కడ తగ్గేది లేదని ఇప్పటికే మంత్రులు తెలిపారు. అయితే కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని.. కొన్ని ఏరియాలో ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారని.. వారికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ధాన్యం సేకరణ సమయంలోనే భారీ వర్షాలు కురవడంతో చాలావరకు పంట నష్టపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.