Save 4 lakhs on car purchase: చాలామంది కొత్త కారు కొనే సమయంలో కారు ధర గురించి ఆలోచిస్తారు.. అలాగే కారు కు అదనంగా ఎంత మొత్తం చెల్లిస్తున్నాం అనే విషయాన్ని పరిశీలిస్తారు. కానీ కారు కొనేటప్పుడు ఇందులో ఎక్స్ షోరూం ధర తోపాటు అదనంగా కొన్ని tax లు కూడా ఉంటాయి. వీటిలో కొన్ని విషయంలో అప్రమత్తంగా ఉంటే భారీ మొత్తంలో నగదు సేఫ్ అవుతుంది. వీటిలో TCS అనేది చాలా ముఖ్యమైనది. కారు కొనుగోలు చేసే సమయంలో దీనికి ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్రాసెస్ ద్వారా తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో చాలామంది సొంత కారు కొనాలని చూస్తున్నారు. అయితే కొందరు ధర విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రీమియం కారు కొనాలని అనుకుంటున్నారు. ప్రీమియం కారు దాదాపు రూ. 10 లక్షల పైగానే ఉంటుంది. ఈ కారు కొనుగోలు చేసేటప్పుడు Tax Collected at Source (TCS) అనేది 1 శాతం వరకు లెస్ అవుతుంది. అంటే దాదాపు రూ. 4 నుంచి 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వానికి జమ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ డబ్బులను మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక చిన్న పని చేయాలి. కారు కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడైతే కారు కొనుగోలు చేస్తారో సంబంధిత డీలర్ వద్ద Form 27 D అనే ఫామ్ ను తీసుకోవాలి. ముందుగానే టాక్స్ కట్ చేశామని.. ఈ ఫామ్ ను తీసుకోవాలి. అయితే ఈ ఫామ్ తీసుకున్న తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో Form 27 D ని కూడా జతచేయాలి. ఇలా చేయడం వల్ల ముందుగా కారు కొనుగోలు చేసే సమయంలో టాక్స్ రిటర్న్ అయి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియక రూ. 4 నుంచి 5 లక్షల వరకు డబ్బులు వృధాగా పోగొట్టుకుంటున్నారు.
ఇకనుంచి అయినా కారు కొనుగోలు చేస్తే అది కూడా.10 లక్షల కు పైగా ఉన్న కారు కొనుగోలు చేస్తే తప్పకుండా ఈ TCS మొత్తాన్ని రిటర్న్ అయ్యే విధంగా చేసుకోండి. అంతేకాకుండా ఇలా కారు కొనుగోలు చేసినప్పుడు TCS కు సంబంధించిన డబ్బులు కూడా 26 A అనే ఫామ్ లో కనిపిస్తుంది. అందువల్ల ఈ మొత్తాన్ని తీసుకోవడానికి అర్హులు అయి ఉంటారు.