https://oktelugu.com/

రూ. 6 లక్షల లోపు 7 సీటర్ కారు.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

రెనాల్ట్ ట్రై బర్ 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. దీని ఎంట్రీ లెవెల్ హాచ్ బ్యాక్ తో వచ్చింది. లేటెస్ట్ సెవెన్ సీటర్ కారు 96 ఎన్ఎం టార్క్ తో పాటు 72 బిహెచ్పి పవర్ ను ఉత్పత్తి చేసే ట్రైబర్ 18.9 నుంచి 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ కారు పై స్పీడ్ 5 మాన్యువల్ 5 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ల అందుబాటులో ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2024 5:21 pm
    Follow us on

    భారత్లో కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నా ఎక్కువ శాతం మంది 7 సీటర్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి దూర ప్రయాణం చేయాలనుకునే వారు 7 సీటర్ కారు ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సెవెన్ సీటర్ అనగానే ధర ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ రూ 6 లక్షల లోపు 7 సీటర్ కారు అందుబాటులో ఉంది. ఆ కారు వివరాలు మీకోసం..

    రెనాల్ట్ కంపెనీ గురించి కారు వాడే వారికి చాలామందికి తెలిసే ఉంటుంది .ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ మార్కెట్ లోకి వచ్చి కారు ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ కంపెనీకి చెందిన 7 సీటర్ కారు ట్రైబర్ కు మంచి ఆదరణ వస్తుంది. దీని ధర కూడా తక్కువగా ఉండడంతో ఈ మోడల్ సేల్స్ పెరిగిపోతున్నాయి.

    రెనాల్ట్ ట్రై బర్ 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. దీని ఎంట్రీ లెవెల్ హాచ్ బ్యాక్ తో వచ్చింది. లేటెస్ట్ సెవెన్ సీటర్ కారు 96 ఎన్ఎం టార్క్ తో పాటు 72 బిహెచ్పి పవర్ ను ఉత్పత్తి చేసే ట్రైబర్ 18.9 నుంచి 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ కారు పై స్పీడ్ 5 మాన్యువల్ 5 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ల అందుబాటులో ఉంది.

    ఈ కారులో 20.32 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆడియో, ఫోన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్ , ఎల్ఈడి డిఆర్ఎల్ తో ప్రొజెక్టర్ హ్యాండ్ ల్యాబ్, అడ్జస్ట్టబుల్ సీట్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనిని 5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వీరియంట్ 8.12 లక్షలతో విక్రయిస్తున్నారు.