లక్ష రూపాయల పెట్టుబడికి రూ.30 లక్షల రూపాయలు.. ఎలా అంటే?

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత స్టాక్ మార్కెట్లలో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో కొంతమంది ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో ప్రవేశించిన స్టాక్ లలో రఘువీర్ సింథటిక్స్ షేర్లు కూడా ఉన్నాయి. కేవలం ఆరు నెలలో ఈ టెక్స్ టైల్ స్టాక్ విలువ 20 రూపాయల నుంచి 600 రూపాయలకు పెరిగింది. గత […]

Written By: Kusuma Aggunna, Updated On : December 11, 2021 4:32 pm
Follow us on

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత స్టాక్ మార్కెట్లలో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో కొంతమంది ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో ప్రవేశించిన స్టాక్ లలో రఘువీర్ సింథటిక్స్ షేర్లు కూడా ఉన్నాయి. కేవలం ఆరు నెలలో ఈ టెక్స్ టైల్ స్టాక్ విలువ 20 రూపాయల నుంచి 600 రూపాయలకు పెరిగింది.

గత వారంలో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ 494 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 600 రూపాయలుగా ఉంది. తక్కువ వ్యవధిలో ఈ స్టాక్ విలువ ఏకంగా 30 రెట్లు పెరగడం గమనార్హం. వారంలోనే రఘువీర్ సింథటిక్స్ షేర్ల విలువ 21.5 శాతం పెరిగింది. గత వారం రఘువీర్ సింథటిక్స్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ప్రస్తుతం ఏకంగా లక్షా 21 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. నెలరోజుల క్రితం ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం ఏకంగా 2.75 లక్షల రూపాయలు వచ్చేవి.

ఆరు నెలల క్రితం ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం ఏకంగా 30 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంది. కేవలం 180 రోజుల వ్యవధిలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ విలువ ఏకంగా 2900 శాతం పెరిగింది. అయితే స్టాక్ మార్కెట్ రిస్క్ తో కూడుకుని ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్లు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ లో కొన్నిసార్లు లాభాలు వస్తే మరి కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తాయి.

సరైన అవగాహన లేని వాళ్లు స్టాక్ మార్కెట్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మరోవైపు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.