Lance Naik Sai Teja: హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది మరణించడంతో అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ్ మరణించడం తెలిసిందే. దీంతో యావత్ దేశం ఆందోళన చెందింది. బిపిన్ రావత్ మరణంపై అందరు సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారికి దేశానికి చెందిన ప్రధానితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు నివాళులర్పించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ సాయితేజ్ కూడా వారిలో ఉండటంతో ప్రభుత్వం వారి కుటుంబానికి సాయం చేయాలని భావించింది. రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సంకల్పించింది. సాయితేజ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని భావిస్తోంది. దీనికి గాను త్వరలోనే చెక్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సైన్యంలో చేరి దుర్మరణం చెందిన జవాన్ కుటుంబానికి పెద్ద ఎత్తును సానుభూతి వ్యక్తమవుతోంది.
Also Read: సర్దార్ రవీందర్ సింగ్ ముందస్తు సంబరాలపై అందరిలో ఆశ్చర్యం?
హెలికాప్టర్ ప్రమాదంపై అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కోనూరు సమీపంలో కుప్ప కూలడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా అకాల మరణం చెందడం తెలిసిందే. దీంతో దీనిపై సమగ్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది. నిజానిజాలు తెలిసేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది.
అయితే మృతదేహాలు గుర్తించడం కష్టమైంది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నారు. దీంతో కాస్త ఆలస్యమైంది. అధికారులు సాయితేజ్ మృతదేహాన్ని గుర్తించి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయితేజ్ స్వగ్రామం ఎగువరేగడలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
Also Read: యూపీలో మళ్లీ గెలుపు పక్కా అంటున్న బీజేపీ.. కమలనాథుల ధీమాకు కారణం ఏంటి..?