Royal Enfield Classic 650 CC
Royal Enfield : భారతదేశంలో బ్రిటిష్ బైక్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా క్లాసిక్ 350 మోడల్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ బైక్ 650cc ఇంజిన్‌తో రాబోతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 భారతదేశంలో మార్చి 27, 2025న విడుదల కానుంది. క్లాసిక్ 350, 650cc ఇంజిన్ కలయికతో ఈ బైక్ మరింత శక్తివంతంగా ఉండబోతోంది.
Also Read : అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త రెనాల్ట్ డస్టర్
క్లాసిక్ 650 ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుంది?
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650లో 648cc, ఎయిర్/ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ మిల్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్‌ను ఇప్పటికే పరీక్షించారు, ఇది 47 bhp పవర్, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే 648cc ఇంజిన్‌తో కొన్ని బైక్‌లను విడుదల చేసింది. వాటిలో సూపర్ మీటియర్ 650, బేర్ 650, ఇంటర్‌సెప్టర్ 650, షాట్‌గన్ 650, కాంటినెంటల్ GT ముఖ్యమైనవి.
షాట్‌గన్ 650 కి క్లాసిక్ 650 కి ఎంత తేడా ఉంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లు ఫైనల్ డ్రైవ్ గేరింగ్‌లో అనేక ఫీచర్స్ దగ్గరగా ఉన్నప్పటికీ కొన్నింటిలో మాత్రం మార్పులు చేశారు.క్లాసిక్ 650 ముందు భాగంలో 19-అంగుళాల వైర్-స్పోక్ వీల్స్, వెనుక భాగంలో 18-అంగుళాల వైర్-స్పోక్ వీల్స్‌తో వస్తుంది. షాట్‌గన్ 650 ముందు భాగంలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగిస్తుంది.
క్లాసిక్ 650 ధర ఎంత ఉంటుంది?
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 భారత మార్కెట్లోకి నాలుగు కలర్ ఆఫ్షన్లలో రావొచ్చచు. ఎరుపు, నీలం, టీల్, బ్లాక్ క్రోమ్. ఈ మోటార్ సైకిల్ ధర సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650 రేంజ్ లోనే ఉండవచ్చు. సూపర్ మీటియోర్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. షాట్‌గన్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read : ఈ ఎస్యూవీ పై ఏకంగా రూ.1.5లక్షల డిస్కౌంట్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు