Homeబిజినెస్RO Membrane : మీ ఇంట్లోని RO ఏ విధంగా ఉప్పు నీటిని తియ్యగా మారుస్తుందో...

RO Membrane : మీ ఇంట్లోని RO ఏ విధంగా ఉప్పు నీటిని తియ్యగా మారుస్తుందో తెలుసా ?

RO Membrane : కలుషిత నీటిని తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నేడు చాలా ఇళ్లలో శుభ్రమైన నీటి కోసం RO వాటర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్ని నగరాల్లో నీరు ఉప్పగా ఉంటుంది.. అంటే RO లేకుండా తాగడం కూడా అసాధ్యం. ఇలాంటి నీటిని త్రాగడానికి అనువుగా మార్చడానికి ROలో ఒక స్పెషల్ పార్టు ఉంటుంది. అదే ఉప్పు నీటిని తియ్యగా, అంటే తాగడానికి అనుగుణంగా మారుస్తుంది. చాలా మందికి నీటిని తియ్యగా మార్చే పని ఏ పార్టు చేస్తుందో తెలియదు.

ROలో ఒకటి కాదు అనేక పార్టులు ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి లేకుండా కూడా అది పనిచేయదు. అలాంటి ముఖ్యమైన భాగాలలో ఒకటి ‘మెమ్బ్రేన్’ (Membrane). మెమ్బ్రేన్ పని ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయడం. నీటి నుంచి ఉప్పు వేరు చేసినప్పుడు RO నుండి వచ్చే నీరు తాగడానికి తియ్యగా ఉంటుంది. ఆ నీరు త్రాగడానికి అనుగుణంగా మారుతుంది. ఈ మెమ్బ్రేన్‌లో చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా కేవలం నీటి అణువులు మాత్రమే వెళ్లగలవు, కానీ ఉప్పు, ఇతర ఖనిజాలు ఆగిపోతాయి.

Also Read : వాటర్ బాటిల్ మూత రంగులో ఇంత అర్థం ఉందా? వాటి అర్థమేంటి?

RO మెమ్బ్రేన్ ధర
RO మెమ్బ్రేన్ సరైన ధర ఎంత ఉంటుందని చాలా మందికి తెలియదు.మెమ్బ్రేన్ ధర మీ ఇంటికి సరఫరా చేసే నీటి TDS (Total Dissolved Solids) ఎంత ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.TDS స్థాయిని బట్టి వేర్వేరు మెమ్బ్రేన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటికి సరఫరా చేసే నీటి TDS 500 నుండి 1000 వరకు ఉంటే, 75GPD (Gallons Per Day) సామర్థ్యం గల మెమ్బ్రేన్‌ను ఉపయోగిస్తారు. దీని ధర సుమారు రూ.1299 ఉంటుంది. అదేవిధంగా, 1000 నుండి 2500 TDS వరకు నీటి కోసం 80GPD మెమ్బ్రేన్‌ను ఉపయోగిస్తారు, దీని ధర రూ.1899 వరకు ఉంటుంది. ఇక 2500 నుండి 3500 TDS వరకు ఉండే నీటి కోసం హై TDS 80GPD మెమ్బ్రేన్‌ను ఉపయోగిస్తారు. దీని కోసం రూ.2750 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వివిధ బ్రాండ్‌లను బట్టి ఈ ధరలు మారవచ్చు.

TDS అంటే ఏమిటి.. నీటిలో అది ఎంత ఉండాలి?
TDS అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్. TDS స్థాయి నీటిలో ఖనిజాల పరిమాణాన్ని తెలియజేస్తుంది. తియ్యటి నీటి కోసం TDS 80 ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, తాగడానికి అనుగుణంగా ఉన్న నీటి TDS 80 నుండి 250 వరకు ఉండవచ్చు. సాధారణంగా, 1 సంవత్సరం లేదా 6000 లీటర్ల నీటిని ఉపయోగించిన తర్వాత మెమ్బ్రేన్‌ను మార్చవలసి ఉంటుంది. మీ నీటి TDS లెవల్ ఎక్కువగా ఉంటే, మీ RO మెమ్బ్రేన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, అవసరమైతే మార్చడం చాలా ముఖ్యం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version