https://oktelugu.com/

Rihanna: అంబానీ ఇంట వేడుకకు రిహన్నా ఎంత తీసుకుందో తెలుసా?

రిహన్నా షో కోసం జామ్ నగర్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఆ సెట్లో శుక్రవారం సాయంత్రం రిహన్నా అదిరిపోయే పాటలు పాడారు. రిహన్నా పాడుతుంటే డాన్సర్లు చిందేశారు.

Written By: , Updated On : March 2, 2024 / 03:26 PM IST
Rihanna
Follow us on

Rihanna: జామ్ నగర్ వేదికగా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలు అంబరాన్నంటే లాగా సాగుతున్నాయి. ప్రపంచంలోని అతిరథ మహారథులు తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది.. శుక్రవారం రోజు అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం డ్రోన్ షో, కాల్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాలీవుడ్ గాయని రిహన్నా తన ఆటపాటలతో సందడి చేసింది. ఆమె పాడుతుంటే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కాలు కదిపారు. డాన్స్ చేసి ఆహూతులను అలరించారు. రిహన్నా తన చార్ట్ బస్టర్ లో టాప్ పాటలు పాడి ఆ వేదికకు కొత్త ఒప్పు తీసుకొచ్చింది. శరీరాన్ని హత్తుకునేలా ఉన్న హగ్గింగ్ వేర్ తో సెగలు పుట్టించింది. ఆమె పాడుతున్న పాటలకు అతిధులు మొత్తం ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. తమను తాము మై మరిచిపోయారు.

రిహన్నా షో కోసం జామ్ నగర్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఆ సెట్లో శుక్రవారం సాయంత్రం రిహన్నా అదిరిపోయే పాటలు పాడారు. రిహన్నా పాడుతుంటే డాన్సర్లు చిందేశారు. బ్యాక్ గ్రౌండ్ సింగర్స్ ఆమెతో కదిపారు. శని, ఆదివారం కూడా రిహన్నా ఇదేవిధంగా పాటలు పాడుతుంది. దీనికోసం అంబానీ కుటుంబం ఏకంగా ఆమెకు 75 కోట్లు ఇస్తోంది. ఆమె వ్యక్తిగత సహాయకులకు చెల్లింపులు ఇందుకు అదనం. రిహన్నా, ఆమె బృందం విడిది చేసేందుకు జామ్ నగర్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ టెంటు ఏర్పాటు చేశారు. ఆమె అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత.. అక్కడినుంచి జామ్ నగర్ రావడానికి ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్టు రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం జరిగిన వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కూడా డాన్స్ వేశారు. దీనికోసం వారు కొద్ది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో 90 ల కాలం నాటి పాటలకు వరస్ట్ ఎప్పుడు 90 ల కాలం నాటి పాటలకు స్టెప్పులు వేస్తూ వచ్చిన అతిథులను ముఖేష్, నీతా అలరించారు. వారిద్దరు డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా అంబానీ కుటుంబం ఈ ముందస్తు పెళ్లి వేడుకల కోసం దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.