https://oktelugu.com/

Renault kwid: నెలకు రూ.5,000 కడితే కొత్త కారు మీ సొంతం.. ఏ విధంగా అంటే?

Renault kwid: ప్రస్తుత కాలంలో కొత్త కారును కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల చాలామంది కారును కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కారును కొనుగోలు చేయడం ప్రస్తుత కాలంలో సులువు కాదనే సంగతి తెలిసిందే. కారును కొన్నా కారు నిర్వహణ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ ఈఎంఐతోనే కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ద్వారా కొత్త […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2021 / 12:01 PM IST
    Follow us on

    Renault kwid: ప్రస్తుత కాలంలో కొత్త కారును కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల చాలామంది కారును కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కారును కొనుగోలు చేయడం ప్రస్తుత కాలంలో సులువు కాదనే సంగతి తెలిసిందే. కారును కొన్నా కారు నిర్వహణ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ ఈఎంఐతోనే కొత్త కారును సొంతం చేసుకోవచ్చు.

    Renault kwid

    బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుండటం గమనార్హం. 6.65 శాతం నుంచి కారు లోన్ విషయంలో వడ్డీరేటు ప్రారంభమవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఈ బెనిఫిట్ ఉంటుందని తెలుస్తోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభం అవుతుంది.

    Also Read: డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

    ఈ కారు ధర 4.8 లక్షల రూపాయలు కాగా 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కనీసం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ ను చెల్లించి ఈ కారును కొనుగోలు చేయవచ్చు. మిగిలిన 3,80,000 రూపాయలకు బ్యాంకు నుంచి రుణం తీసుకుని 8 సంవత్సరాల టెన్యూర్ ను పెట్టుకుంటే నెలకు 5,000 రూపాయల చొప్పున ఈ.ఎం.ఐ చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ రేట్లు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు అంశాల గురించి తెలుసుకుని ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    బ్యాంక్ నుంచి రుణం తీసుకునే వాళ్లు ఫోర్‌క్లోజర్ చార్జీలు, లేట్ పేమెంట్ చార్జీల గురించి కూడా కచ్చితమైన అవగాహనను కలిగి ఉండాలి. కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లు ఈ విధంగా సులభంగా కారును కొనుగోలు చేయవచ్చు.

    Also Read: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.36,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్?