https://oktelugu.com/

Omicron: ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ కు ఛాన్స్.. కేంద్రం కీలక సూచనలు..!

Omicron: కరోనా వైరస్ ఎంట్రీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. మనిషి నుంచి మరో మనిషికి ఈ కరోనా వేగంగా వ్యాపిస్తూ ఎక్కువగా మరణాలను నమోదు చేస్తుండటం ఆందోళన రేపుతోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే కరోనా కొత్త కొత్త వేరింయట్లతో మానవళిపై విరుచుకు పడుతుండటం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. నిన్నటి వరకు డెల్టా వేరియంట్ పేరు చెబితే హడలిపోయిన జనాలు.. ఇప్పుడు ఒమిక్రాన్ పేరు చెబితే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 11:54 am
    Follow us on

    Omicron: కరోనా వైరస్ ఎంట్రీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. మనిషి నుంచి మరో మనిషికి ఈ కరోనా వేగంగా వ్యాపిస్తూ ఎక్కువగా మరణాలను నమోదు చేస్తుండటం ఆందోళన రేపుతోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే కరోనా కొత్త కొత్త వేరింయట్లతో మానవళిపై విరుచుకు పడుతుండటం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.

    Omicron

    Corona

    నిన్నటి వరకు డెల్టా వేరియంట్ పేరు చెబితే హడలిపోయిన జనాలు.. ఇప్పుడు ఒమిక్రాన్ పేరు చెబితే భయపడిపోతున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శక్తివంతమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెల్లా వేరియంట్ పోలిస్తే ఆరు రెట్ల వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతో ఒమిక్రాన్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

    ఈమేరకు భారత ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కీలక సూచనలు చేస్తోంది. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ముంపు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరింది.

    ఒమ్రికాన్ ను ముందుగానే ఎదుర్కొనేందుకు గాను అన్ని రాష్ట్రాలు వైద్య సదుపాయాలను మెరుగుపర్చుకోవాలంది. జిల్లా స్థాయిలో అత్యవసర చికిత్సలకు సంబంధించిన పరికరాలను, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. అన్ని మెట్రో నగరాల్లో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది.

    వైరస్ ఉధృతి నేపథ్యంలో కొత్తగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ).. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వన్‌ హెల్త్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణ కేంద్రాల వద్ద ప్రజారోగ్య కేంద్రాలను నెలకొల్పాలని స్పష్టంచేసింది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల, ఆసుపత్రుల పడకల ధరలకు పరిమితులు విధించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.

    Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?

    మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ చివరి ఏడాది విద్యార్థుల సేవలను కొవిడ్‌ విధుల్లో ఉపయోగించుకోవాలని చెప్పింది. కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్‌ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవాలంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

    చిన్నారుల విషయంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పిల్లలో కరోనాకు సంబంధించిన ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ను ఎదుర్కోవడానికి అన్ని సదుపాయాలను ఆస్పత్రుల్లో కల్పించాలని పేర్కొంది. కోవిడ్ ప్రోటోకాల్ ను అన్ని రాష్ట్రాలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సంక్రాంతి తర్వాత కేసులు పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

    Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ముప్పు ఎక్కువట!