https://oktelugu.com/

Harish Rao: ‘హరీష్’కు పెరిగిన ప్రాధాన్యం.. వ్యూహమేనా?

Harish Rao: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టారనే ప్రచారం తెలంగాణలో జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కొన్నిరోజులపాటు నడిచింది. రెండోసారి క్యాబినేట్ ప్రకటించిన సమయంలో హరీష్ రావు, ఈటల రాజేందర్ లను పక్కన పెట్డడంతో ఇదే నిజమననే అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ ఆ తర్వాత వీరిద్దరినీ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. హరీష్ రావుకు కీలకమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 12:22 PM IST
    Follow us on

    Harish Rao: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టారనే ప్రచారం తెలంగాణలో జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కొన్నిరోజులపాటు నడిచింది. రెండోసారి క్యాబినేట్ ప్రకటించిన సమయంలో హరీష్ రావు, ఈటల రాజేందర్ లను పక్కన పెట్డడంతో ఇదే నిజమననే అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ ఆ తర్వాత వీరిద్దరినీ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.

    Harish Rao

    హరీష్ రావుకు కీలకమైన ఆర్థిక శాఖను ఇవ్వగా ఈటల రాజేందర్ కు వైద్యారోగ్య శాఖను కట్టబెట్టారు. అంతా సజావుగా సాగిపోతుందని అనుకున్న సమయంలోనే మంత్రి ఈటల అసైన్డ్ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో సీఎం కేసీఆర్ ఆయన్ని క్యాబినేట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి యువనాయకుడు గెల్లు శ్రీనివాస్ బరిలో నిలువగా హుజూరాబాద్ నియోజవకర్గ బాధ్యతలను హరీష్ రావు పర్యవేక్షించారు.

    ఈటల రాజేందర్ ఓటమి కోసం హరీష్ రావు తనశక్తి మేర పని చేశారు. అయినప్పటికీ ఈటల రాజేందర్ వేవ్ హుజూరాబాద్లో బలంగా వీయడంతో గతంలో కంటే ఎక్కువ ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఈటల గెలుపుతో మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కుతుందని అంతా భావించారు. అయితే అనుహ్యంగా ఈటల రాజేందర్ పర్యవేక్షించిన ఆరోగ్య శాఖను సైతం సీఎం కేసీఆర్ హరీష్ రావుకే అదనంగా కట్టబెట్టారు.

    ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఎక్కడ చూసినా హరీష్ రావు హడావుడే కన్పిస్తోంది. నిత్యం సమావేశాలు, సమీక్షలు, ప్రారంభోత్సవాలతో మీడియాలో ఫోకస్ అవుతున్నారు. ఇటీవల వరంగల్లో సెంట్రల్ జైలును హడావుడి కూల్చివేసి నిధులు విడుదల మరిచారు. ఈనేపథ్యంలో రెండ్రోజుల కిందట ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా హరీష్ రావును మంత్రి ఎర్రబెల్లి పొగడ్తలతో ముంచెత్తారు.

    Also Read: టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేస్తారా?

    ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో కేటీఆర్ చేసేవారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా మంత్రి కేటీఆర్ ముందుండి చూసుకునేవారు. ఇతర మంత్రులు మీడియా ముందు పెద్దగా ఫోకస్ అయ్యేవారు కాదు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఇది నచ్చదని అందుకనుగుణంగా వారంతా వ్యవహరించే వారనే టాక్ ఉంది.

    అయితే హరీష్ రావు విషయంలో మాత్రం సీఎం కేసీఆర్, కేటీఆర్లే ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. అండర్ ప్లేగా హరీష్ రావును వాడుతున్నారని అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ మంత్రి హరీష్ రావు విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారనేది ఆసక్తిని రేపుతోంది.

    Also Read: కేసీఆర్ ను మోకాళ్లపై కూర్చుండబెట్టి పైకి ఎక్కిన ఈ పిల్లాడు కేటీఆర్ కాదు.. ఎవరో తెలుసా?