Renault Duster 2026: ఆటోమోబైల్ చరిత్రలోనే బెస్ట్ SUV గా పేరు తెచ్చుకున్న ఆ కారు దశాబ్దం కాలం కిందట మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టించింది. దీని పర్ఫామెన్స్ చూసిన చాలామంది క్యూ కట్టి మరి ఆ కారును కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ కారు దూకుడు సినిమాల్లోనూ కనిపించింది. అయితే కొన్నేళ్ల తర్వాత కనుమరుగైన ఆ కారు మళ్లీ రాబోతుందన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే అది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవారికి కంపెనీ బిగ్ అప్డేట్ ఇచ్చింది. మార్చి 17 2026న దీనిని రీ డిజైన్ చేసి తీసుకురావడానికి సిద్ధం చేసింది. అయితే ఈ కారులో స్పెషల్ లేకపోలేదు. కొత్త తరహాలో వస్తున్న ఈ కారు ఎలా ఉండబోతుంది? ఇంతకీ ఇది ఏ కారు?
ఫ్యాక్షనిస్టు సినిమాలు చూసేవారికి Renault Duster గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. SUV వేరియంట్ లో తనదైన సత్తా చాటిన ఈ కారు అప్పట్లో ఒక ట్రెండును సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే పలు కారణాలవల్ల ఈ కారు కనిపించకుండా పోయింది. మళ్లీ ఈ కారు వస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు. అలాంటివారికి అనుగుణంగా రెనాల్ట్ కంపెనీ డస్టర్ ను కొత్త తరహాలో తీర్చిదిద్ది మార్కెట్లోకి తీసుకువస్తుంది ఈ కొత్త డస్టర్ డిజైన్ చూస్తే కారు కొనాలని అనుకునేవారు వెంటనే టెంప్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ కారుకు LED హెడ్ లాంప్స్ ప్రీమియం లుక్ ను తీసుకొచ్చాయి. గ్రిల్ పై పెద్ద అక్షరాలతో Duster అని లోగో కనిపించడంతో ఎంత దూరం నుంచి చూసిన ఈ కారును గుర్తించవచ్చు. అంతేకాకుండా దీనికి ఉండే అల్లాయి వీల్స్, బ్లాక్ క్లాడింగు వంటివి స్టైలిష్ గా ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో చాలామంది ఉమ్మడి కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సొంతంగా కారు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఈ కారు ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ చేస్తే ఇందులో ఎలాంటి అలసట అనిపించదు అంతేకాకుండా ఇందులో స్మార్ట్ ఫీచర్స్ కు కొదవలేదు. ఈ కారులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉండడంతో డ్రైవర్లకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు అదనపు సపోర్ట్ గా ఉంటాయి. కారు ఇన్నర్ స్పేస్లో 518 బూట్ స్పేస్ ఉండడంతో విశాలమైన కారుగా చెప్పుకోవచ్చు.
ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే .. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది 100 PS ను అందిస్తుంది. అలాగే 160 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. దీనితోపాటు 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ కూడా ఇందులో సెట్ చేశారు. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారికంగా కంపెనీ ఏ విధమైన ధరను నిర్ణయిస్తుందో చూడాలి.