Reliance Power Share Price : బెంచ్ మార్క్ సూచీలు సానుకూల దృక్పథాన్ని కలిగించడంతో సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు కొనసాగిస్తున్నాయి.. సోమవారం అమెరికా మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కొనసాగడంతో భారతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణ కనిపించింది. అయితే ఈ ప్రభావం మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతోంది. ముఖ్యంగా రిలయన్స్ పవర్ షేర్ ధర భారీగా పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో సత్తా చాటాలని రిలయన్స్ భావిస్తోంది. కంపెనీ అంచనాలకు అనుగుణంగానే పెట్టుబడిదారులు రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం నాటి ట్రేడింగ్ లో రిలయన్స్ పవర్ లిమిటెడ్ షేర్ 5% పెరిగింది.. అథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సనాతన ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అనే రెండు నాన్ ప్రమోటర్ సంస్థలు(ఇవి కొఠారి, మీనాక్షి సంజయ్ కొఠారి ఆధ్వర్యంలో ఉన్నాయి) ప్రిఫరెన్షియల్ ఇష్యు ద్వారా 1,524.60 కోట్ల విలువైన 46.20 కోట్ల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు మొగ్గు చూపడంతో స్టాక్ వేల్యూ అమౌంట్ పెరిగింది..
ఇష్యూ ధర ఎంతంటే..
రిలయన్స్ పవర్ విష్ యు ధర 33 గా నిర్ణయించారు. మంగళవారం ముగింపు ధర కంటే ఇది 14% అధికం.. స్టాక్ వాల్యూ పెరగడంతో 803.60 కోట్లను పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడి పెట్టేందుకు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, ఇతర కొత్త వ్యాపార రంగంలోకి విస్తరించాలని రిలయన్స్ భావిస్తోంది.. పెరిగిన స్టాక్ వ్యాల్యూ తో రిలయన్స్ పవర్ ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ పరిమితిని తాకింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఇది రూ.40.06 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. గత తొమ్మిది సెషన్లలో రిలయన్స్ పవర్ షేర్ 35.48 శాతం పెరగడం విశేషం. 2024 స్టాక్ లో ఇప్పటివరకు 67% షేర్ ధర పెరగగా.. గత ఏడాది ప్రకారం చూసుకుంటే దీని విలువ 111 శాతం పెరిగింది.. షేర్ల కేటాయింపు తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలయన్స్ పవర్ లో 24.88 శాతం వాటాను కలిగి ఉంటుంది.
ప్రమోటర్ వాటా ఎంతకు చేరుకుందంటే..
రిలయన్స్ పవర్ ఇప్పటివరకు 18,31,00,00 ఈక్విటీ షేర్లను కేటాయించింది. పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో ప్రమోటర్ గ్రూప్ మొత్తం వాటా 24.95 శాతానికి చేరుకుంది. జూన్ 30 నాటికి రిలయన్స్ పవర్ లో 93,01,04,490 షేర్లను ప్రమోటర్ గ్రూప్ కలిగి ఉంది. 21,82,00,000 వరకు ఈక్విటీషర్లను కేటాయించిన తర్వాత అథమ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెయిడ్ – అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 6.59 శాతం వాటర్ కలిగి ఉంది. జూన్ 30 నాటికి రిలయన్స్ పవర్ లో ఈ కంపెనీ 7,67,77,000 షేర్లు లేదా 1.91 శాతం వాటా కలిగి ఉంది. ఇక ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయంలో 340 కోట్లను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి స్వీకరించిన రుణాన్ని, రిలయన్స్ పవర్ ప్రస్తుత రుణంలో భాగాన్ని తీర్చడానికి ఉపయోగిస్తారని వార్తలు వస్తున్నాయి.
గమనిక: ఒకే తెలుగు ఈ కథనాన్ని వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి మాత్రమే అందించింది. దీనిని పెట్టుబడి సలహాగా ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు.. విశేష అనుభవం ఉన్న ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.