Nara Bhuvaneswari Rare Honor: నారా భువనేశ్వరికి( Nara Bhuvaneswari ) మరో అరుదైన గౌరవం దక్కింది. డైరీరంగంలో విశేష సేవలందిస్తున్నందుకుగాను.. ఇండియన్ డైరీ అసోసియేషన్ అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డును అందించింది. కొద్ది రోజుల కిందట లండన్ లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు మరో అవార్డుకు ఎంపిక కావడం విశేషం. నారా భువనేశ్వరికి భర్త సీఎం చంద్రబాబు తో పాటు కుమారుడు లోకేష్ సైతం అభినందనలు తెలిపారు. ఇటు నందమూరితోపాటు అటు నారా కుటుంబంలో కూడా ఆనందం నెలకొంది.
* మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పాటు..
మూడున్నర దశాబ్దాల కిందట హెరిటేజ్( heritage) సంస్థను ఏర్పాటు చేశారు చంద్రబాబు. తాను రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలను భార్య భువనేశ్వరికి అప్పగించారు. ఆమె సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. తరువాత అదే సంస్థలో నారా లోకేష్ సైతం సేవలందించారు. ఇప్పుడు కోడలు బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారు హెరిటేజ్ లో. పూర్తి బాధ్యతలు ఆమె చూస్తున్నారు. అయితే వైస్ చైర్ పర్సన్ గా భువనేశ్వరి కొనసాగుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ గా సైతం ఆమె ఉన్నారు. మొన్న మధ్యన నారా బ్రాహ్మణి సైతం వ్యాపార రంగంలో చురుకైన పాత్ర పోషిస్తున్నందున అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పుడు మరోసారి భువనేశ్వరికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం విశేషం.
* విస్తృతంగా సేవా కార్యక్రమాలు..
మహిళా సాధికారితతో పాటు డైరీ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది ఇండియన్ డైరీ అసోసియేషన్. మరోవైపు నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నారు. మొన్న ఆ మధ్యన లుకేమియా తో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏకంగా మ్యూజికల్ ఈవెంట్ విజయవాడలో ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమ నేతృత్వంలో ఈవెంట్ కొనసాగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే ఒకవైపు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరోవైపు హెరిటేజ్ వైస్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నారా భువనేశ్వరి కి ప్రతిష్టాత్మక అవార్డు రావడం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.