Homeబిజినెస్Redmi 15C 5G: రెడ్‌మీ బడ్జెట్‌ ఫోన్‌.. రూ.12 వేల ధరలో అద్భుతమైన ఫీచర్లు.. ఐదేళ్ల...

Redmi 15C 5G: రెడ్‌మీ బడ్జెట్‌ ఫోన్‌.. రూ.12 వేల ధరలో అద్భుతమైన ఫీచర్లు.. ఐదేళ్ల అప్‌డేట్‌తో..

Redmi 15C 5G: భారత మొబైల్‌ మార్కెట్‌లో తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కస్టమర్లకు మొబైల్స్‌ అందిస్తున్న సంస్థ రెడ్‌మీ. తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేవలం రూ.12 వేల ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉన్న రెడ్‌మీ 15సీ 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారీ స్క్రీన్, లాంగ్‌–లాస్టింగ్‌ బ్యాటరీ, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌తో ఆకట్టుకుంది. లేటెస్ట్‌ 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. డస్క్‌ పర్పుల్, మిడ్‌నైట్‌ బ్లాక్, మూన్‌లైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

6.9‘ హెచ్‌డీ డిస్‌ప్లే..
120 Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ 810 నిట్స్‌ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ సాంప్లింగ్‌ అందిస్తుంది. IP64 డస్ట్‌–వాటర్‌ రెసిస్టెన్స్‌తో రోజువారీ ఉపయోగానికి డ్యూరబుల్‌. మెడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌తో 8 GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌. ఆండ్రాయిడ్‌ 15 HyperOS 2పై పనిచేస్తుంది. 2 OS అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు గ్యారంటీ ఇస్తుంది.

కెమెరాలు – బ్యాటరీ..
వెనుక 50 ఎంపీ ఏఐ ప్రధాన + సెకండరీ కెమెరాలు క్లియర్‌ షాట్‌లు తీస్తాయి. ముందు 8 ఎంపీ సెల్ఫీ, వీడియో కాల్స్‌కు సరిపోతుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33 W ఫాస్ట్‌ చార్జింగ్‌తో రోజంతా నడుస్తుంది. 5జీ, 4జీ, వైఫై , బ్లూటూత్‌ 5.4, జీపీఎస్, 3.5 ఎంఎం జాక్, ఐఖబ్లాస్టర్, USB, C పోర్ట్‌లు ఉన్నాయి. సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ భద్రతను పెంచుతుంది.

రూ.12 వేల నుంచి రూ.15 వేల రేంజ్‌లో భారీ స్క్రీన్, భారీ బ్యాటరీ, దీర్ఘ మద్దతు అందించే రెడ్‌మీ 15సీ 5జీ బడ్జెట్‌ కస్టమర్లకు గేమ్‌–చేంజర్‌. రోజువారీ ఉపయోగానికి పర్ఫెక్ట్‌.

ధరలు – అందుబాటు
వేరియంట్‌ ధర(రూ.లలో) అందుబాటు
4GB RAM + 128GB 12,499 షియోమీ ఇ–స్టోర్, అమెజాన్‌
6GB RAM + 128GB 13,999 షియోమీ ఇ–స్టోర్, అమెజాన్‌
8GB RAM + 128GB 15,499 షియోమీ ఇ–స్టోర్, అమెజాన్‌

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular