Redmi 14C 5G : రెడ్‌మి ఇండియన్ మార్కెట్ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో టీజ్ చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాను సూచిస్తుంది. ఇది ‘2025G’ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేయబడింది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని ప్రారంభించవచ్చు. ఫోన్ ధర కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. రాబోయే ఫోన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫోన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. రెడ్‌మి 14సి 5 జి పేరుతో భారత్, గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు. Redmi 14C అనేది చైనీస్ Redmi 14R 5G గ్లోబల్ వేరియంట్ కావచ్చు. Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. షియోమీ బ్రాండ్ రాబోయే మోడల్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయనప్పటికీ, కొన్ని విషయాలు మాత్రం ఈ మోడల్ అభివృద్ధి వైపు సూచనలను అందిస్తున్నాయి. రెడ్‌మి ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేసింది. ఈ పోస్ట్‌లో రాబోయే ఫోన్ పేరు మాత్రం ప్రస్తావించబడలేదు.. కానీ అది Redmi 14C 5G కావచ్చునని ఒక టిప్‌స్టర్ చెప్పారు.
రెడ్ మీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ ద్వారా భారతదేశంలో తన రాబోయే స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇక్కడ పేరు మాత్రం సీక్రెట్ గా ఉంచింది. కానీ ఒక ఫోటో షేర్ చేసింది కంపెనీ. ఇది స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో పెద్ద రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను చూపిస్తుంది. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన Redmi 14C (4G) లాగా కనిపిస్తుంది.
పోస్ట్‌లో 2025G అనే పదం ఉపయోగించింది. ఇది 2025లో 5G స్మార్ట్‌ఫోన్‌లను సూచిస్తుంది. దీన్ని బట్టి రాబోయే ఫోన్ 5G కనెక్టివిటీతో అమర్చబడి ఉంటుందని ఊహించవచ్చు. దీంతోపాటు రెడ్‌మి 14C 5G హ్యాండ్‌సెట్.. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న రెడ్ మీ 14R 5G తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ రెడ్‌మి 14C 5G ఇండియన్ వేరియంట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ మార్కెట్‌లో 2025 తొలి రోజుల్లో లాంచ్ కానుందని తెలిపారు.
రెడ్‌మి 14C 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 120హెడ్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.68 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల కానుంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేసే అవకాశం ఉంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 13ఎంపీ ప్రైమరీ కెమెరా సహా మరో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ కెమెరాను అమర్చి ఉంటుంది. 18వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఈ రెడ్‌మి ఫోన్ స్టోరేజీ వేరియంట్లు సహా ధర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రెడ్‌మి 13C 5G వేరియంట్ బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారత్ మార్కెట్‌లోకి ఈ నెలలో రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
[Exclusive] Redmi 14C 5G real-life image (Indian retail store) in Blue color.
Looks cool IMO.
Might very well be the first smartphone launch of 2025.
Thoughts on the design? pic.twitter.com/1v03sZAYkI— Mukul Sharma (@stufflistings) December 26, 2024