CM Revanth Reddy : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు సాధించినటువంటి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు… మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మన ఇండస్ట్రీ నే ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అతలాకుతలమవుతుంద. కారణం ఏంటి అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందుతున్నప్పటికి ప్యూచర్ లో అందుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇక మీదట సినిమా ఇండస్ట్రీకి రాయితీలను ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు యావత్ సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేశాయి… నిజానికి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది సగటు ప్రేక్షకుడికి రిలాక్సేషన్ కోసం సినిమాలను చూస్తుంటారు.
దానివల్ల ప్రేక్షకుడి యొక్క మైండ్ రిలాక్స్ అవ్వాలి గాని వాళ్ళ ప్రాణాలు పోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే నిన్న సినీ పెద్దలు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో మీటింగ్ ని పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక దీనిమీద వాళ్ళందరు కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట టిక్కెట్ల రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తే ఆ రేట్ల మీద ‘సేస్ టాక్స్’ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బును పేద విద్యార్థులు చదువుల కోసం ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ డెవలప్ మెంట్ కోసం వాడబోతున్నాం అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక దానికి సినిమా యూనిట్ అంగీకరిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడానికి తను ఆమోదిస్తానని చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచడం అనేది మామూలు విషయం కాదు. సగటు ప్రేక్షకుడి మీద భారం పడుతుంది.
మరి ఇలాంటి విషయాల్లో దీని ద్వారా కొంతవరకు సమాజానికి హెల్ప్ అవ్వబోతుంది అంటేనే వాళ్లు కూడా ఆ సినిమా టికెట్ మీద పెంచిన రేట్ల కు తగ్గట్టుగా టిక్కెట్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు అంటూ సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సినిమా టిక్కెట్ రేట్ పెంచుకోవాలంటే మాత్రం ఇకమీదట రేవంత్ రెడ్డి పెట్టిన ఆ టాస్క్ ను తప్పకుండా అందరూ పాటించాల్సిందే…