Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఇక నంబర్ 1

ఇక టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌ స్టోక్స్‌ నాలుగో స్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన అక్షర్‌ పటేల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.

Written By: NARESH, Updated On : February 7, 2024 4:20 pm

Jasprit Bumrah

Follow us on

Jasprit Bumrah : ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్‌ బౌలర్‌ బుమ్రా అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో ట్యాంప్‌ ర్యాంకర్‌గా నిలిచిన తొలి పేసర్‌గా రికార్డు సృష్టించాడు. కేరీర్‌లో తొలిసారి బుమ్రా ఈ ఫీట్‌ సాధించాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయం అందించాడు.

తాజా ర్యాంక్స్‌లో..
తాజాగా ఐసీసీ క్రికెట్‌ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఇందులో బుమ్రబా మొదటి స్థానంలో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన మొదటి భారత ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించి మరో చరిత్ర సృష్టించాడు.

34 టెస్టు మ్యాచ్‌లు..
ఇక బుమ్రా తన కెరీర్‌లో టీమిండియా తరఫున 34 టెస్టులు ఆడాడు. ఇప్పటి వరకు పదిసార్లు ఐదు వికెట్లు పడగొట్లాడు. గతంలో ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్‌సలో మూడో స్థానం వరకు వచ్చిన బుమ్రా ఈసారి మాత్రం మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్‌గా నలిచాడు. గత మార్చి నుంచి నంబర్‌ వన్‌గా ఉన్న అశ్విన్‌ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో దక్షిణాప్రికా బౌలర్‌ రబడ రెండో స్థానంలో ఉండగా, బుమ్రా మూడోస్థానంలో ఉన్నాడు. అశ్విన్, రవీంద్ర జడేజా, బిషెన్‌సింగ్‌ బేడీ తర్వాత టెస్ట్‌ క్రికెట్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

జైస్వాల్‌ కూడా..
ఇక తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో మరో భారత ఆటగాడు కూడా సత్తా చాటాడు. వైసాగ్‌ టెస్టులో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన యశస్విజైస్వాల్‌ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంకుకు చేరుకున్నాడు. విశాఖ టెస్టు విజయంలో యశస్వి కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అందరూ తడబడినా యశస్వి మాత్రం జట్టుకు అండగా నిలిచి భారీ స్కోర్‌ చేయడానికి సహాయపడ్డాడు. ఇక టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌ స్టోక్స్‌ నాలుగో స్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన అక్షర్‌ పటేల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.