ఆర్‌బీఐ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా చేస్తే రూ.40 లక్షలు మీ సొంతం?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతో ఆర్బీఐ గ్లోబల్ హ్యాకథాన్ ను నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. ఈ నెల 15వ తేదీ నుంచి హ్యాకథాన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది. ఈ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచిన వాళ్లకు 40 లక్షల రూపాయల బహుమతి దక్కుతుంది. ఈ హ్యాకథాన్ కార్యక్రమంలో రెండో బహుమతిని గెలుపొందిన విజేతకు […]

Written By: Kusuma Aggunna, Updated On : November 16, 2021 9:29 am
Follow us on

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయాలనే లక్ష్యంతో ఆర్బీఐ గ్లోబల్ హ్యాకథాన్ ను నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. ఈ నెల 15వ తేదీ నుంచి హ్యాకథాన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది. ఈ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచిన వాళ్లకు 40 లక్షల రూపాయల బహుమతి దక్కుతుంది.

ఈ హ్యాకథాన్ కార్యక్రమంలో రెండో బహుమతిని గెలుపొందిన విజేతకు 20 లక్షల రూపాయలు లభిస్తాయి. https://hackolosseum.apixplatform.com/hackathon/harbinger2021 వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 15వ తేదీ రిజిస్టేషన్ చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు డిజిటల్ పేమెంట్స్ ను వినియోగించని వారికి సైతం పేమెంట్స్ విధానం మరింత చేరువ కావడానికి పరిష్కార మార్గాలను సూచించాలి.

అదే సమయంలో కస్టమర్ల డేటాకు రక్షణ పెంచడం, వినియోగదారుల అనుభవంను మెరుగుపరచడం, చెల్లింపులను సులభతరం చేయడం చేయవచ్చు. ఈ హ్యాకథాన్ ప్రోగ్రామ్ ద్వారా రీటైల్ చెల్లింపులకు సంబంధించి పరిష్కార మార్గాలను కూడా సూచించాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులలో మోసాలకు సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా సూచించి సమస్యను అధిగమించేలా చేయాలి.

ఎవరైతే ఈ హ్యాకథాన్ లో పాల్గొంటారో వాళ్లు నాలుగు అంశాలకు సంబంధించిన పరిష్కార మార్గాలను సూచించాల్సి ఉంటుంది. జ్యూరీ ఎదుట ఆ పరిష్కార మార్గాల గురించి ప్రదర్శించాలి. https://fintech.rbi.org.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.