https://oktelugu.com/

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు… అసలేం జరిగిందంటే ?

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజినీ కాంత్ తర్వాత తమిళనాడు లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో అంటే విజయ్ పేరే చెప్పాలి. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తుపాకి, అదిరింది, మాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అభిమానులకు షాక్ కలిగించే వార్త ఓ వార్త బయటికి వచ్చింది.  విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 09:39 AM IST
    Follow us on

    Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజినీ కాంత్ తర్వాత తమిళనాడు లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో అంటే విజయ్ పేరే చెప్పాలి. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తుపాకి, అదిరింది, మాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అభిమానులకు షాక్ కలిగించే వార్త ఓ వార్త బయటికి వచ్చింది. 

    విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలాంగరైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నీలాంగరై పోలీసులు, బాంబు స్క్వాడ్‌ కలిసి ఇంట్లో తనిఖీ చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో అధికారులు. విజయ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఆ ఫోన్ కాల్ గురించి విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించే షాకింగ్ విషయాలు తెలిసాయి. విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి  చెందిన భువనేశ్వర్‌ అనే యువకుడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. మతిస్థిమితం లేని  కారణంగా అతను గతంలో కూడా ఇలా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్‌ చేసినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.