Range Rover 2026: రేంజ్‌రోవర్.. అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత లగ్జరీ కార్లలో ఒకటి. ఖరీదైన ఈ కారు సంపన్నుల ప్రెస్టీజీకి నిదర్శనం. ఇందులోని లగ్జరీ, సేఫ్టీ మెజర్స్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి. ఈ రేంజ్‌రోవర్ తాజాగా 2026 లగ్జరీ ఎస్‌యూవీలకు కొత్త మార్కును నిర్దేశిస్తోంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీ, అద్భుతమైన ఇంటీరియర్‌తో నేచర్ ప్రెండ్లీగా సరికొత్త మోడల్ లాంచ్ చేసింది. నగర రోడ్లు మీదా, కష్టమైన ఆఫ్‌రోడ్‌లలోనా సుఖమైన ప్రయాణం కలిగిస్తుది.
ఆకట్టుకునే లుక్..
సన్నని లైన్లు, బలమైన గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులతో రోడ్డుపై ఆకట్టుకునే లుక్. ఏరోడైనమిక్ డిజైన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాయ్ వీల్స్, పానోరమిక్ సన్‌రూఫ్, క్రోమ్ అక్సెంట్లు లగ్జరీని మరింత ఉన్నతం చేస్తాయి. ఇక లోపలవిశాలమైన క్యాబిన్.. ప్రీమియం లెదర్, చెక్క ట్రిమ్స్, అంబియెంట్ లైటింగ్ ఆకట్టుకుంటాయి. మల్టీ–వే అడ్జస్టబుల్ సీట్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు అతి సౌకర్యాన్ని అందిస్తాయి. పార్కింగ్, సులభమైన ఇన్ఫోటైన్‌మెంట్ వాడకానికి అనుకూలం.
అధునాతన టెక్నాలజీ, సేఫ్టీ..
అడాప్టివ్ క్రూజ్, లేన్ కీపింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360–డిగ్రీ కెమెరాలతో సురక్షితంగా ప్రయాణం. Pivi Pro ్కటౌ సిస్టమ్ నావిగేషన్, కనెక్టివిటీ, వాయిస్ కమాండ్‌లను సులభతరం చేస్తుంది.
ముఖ్య స్పెసిఫికేషన్లు..
ఫీచర్ వివరాలు
––––––––––
ఇంజన్ ఎంపికలు 3.0 L ఇన్‌లైన్–6 హైబ్రిడ్ / 4.4L V8 మైల్డ్ హైబ్రిడ్ ్ఢ
మొత్తం శక్తి 355–523 హార్స్‌పవర్
టార్క్ 500–750 Nm
ట్రాన్స్‌మిషన్ 8–స్పీడ్ ఆటోమేటిక్
డ్రైవ్‌ట్రైన్ అన్ని చక్రాల డ్రైవ్
0–60 mph సుమారు 5.0–6.0 సెకన్లు
ఇంధన సామర్థ్యం 18–23 mpg (హైబ్రిడ్)
ఇన్ఫోటైన్‌మెంట్ 13.1–ఇంచ్ టచ్‌స్క్రీన్,Pivi Pro, Apple CarPlay, Android Auto
సీటింగ్ 5 మంది, ప్రీమియం లెదర్
సేఫ్టీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, 360–డిగ్రీ కెమెరా, బ్లైండ్–స్పాట్ మానిటరింగ్
హైబ్రిడ్ ఇంజన్‌లు తక్షణ టార్క్, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. ఎయిర్ సస్పెన్షన్ ఏ రోడ్డీ సౌకర్యవంతంగా తీసుకెళ్తుంది, టెరైన్ రెస్పాన్స్ సిస్టమ్ వివిధ భూములకు సర్దుబాటు చేస్తుంది.
2026 రేంజ్ రోవర్ హైబ్రిడ్ శక్తి, అధునాతన ఫీచర్లు, అంతర్గత లగ్జరీ ఎస్‌యూవీలకు కొత్త పరిమితిని నిర్దేశిస్తుంది. రోడ్లు, ట్రైల్స్‌లో అద్భుతంగా పనిచేసే ఈ మోడల్ ఉన్నత కస్టమర్లకు సరైన ఎంపిక.
