రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ రైల్వేశాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి సమయంలో రైలు ప్రయాణికులు ఛార్జింగ్ పాయింట్లను వినియోగించే అవకాశం ఉండదని రైల్వే శాఖ నుంచి సంచలన ప్రకటన వెలువడింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read: బంగారం అసలైందా..? నకిలీదా..? ఎలా గుర్తు పట్టాలంటే..?
ఈ నెల 13వ తేదీన డిల్లీ నుంచి డెహ్రాడూన్ కు వెళుతున్న రైలు శతాబ్డి ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: మీ ఇంట్లో పాత పేపర్లు ఉన్నాయా.. వేలు సంపాదించే ఛాన్స్..?
రైళ్లలో పొగరాయుళ్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పొగరాయుళ్లకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు భారీ జరిమానాలను విధించడానికి సిద్ధమైంది. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లలో ఒకరైన సుమిత్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. అన్ని రైల్వే జోన్లలో రాత్రిపూట ఛార్జింగ్ ను నిలిపివేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇకపై రైలు ప్రయాణికులు పగలు మాత్రమే మొబైల్స్, ల్యాప్ టాప్స్ ను ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సదరన్ రైల్వే సీపీఆర్వో బీ గుంగనేషన్ మాట్లాడుతూ రైల్వే సిబ్బంది రాత్రి సమయంలో ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More