
‘అరుంధతి’ సినిమాలో విలన్ సోనూసూద్ ‘అఘోర’ వేషం వేస్తేనే ఎంతో భయపెట్టాడు. అసలు అలాంటి పాత్రలో అలా బీభత్సం సృష్టిస్తానని అనుకోలేదని అన్నాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో అఘోర వేషం వేస్తే.. అఘోరాధిపతిగా బీభత్సం సృష్టిస్తే ఎలా ఉంటుంది..? ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ రావడం ఖాయం. ఇప్పుడు అదే వెండితెరపై చూపించడానికి దర్శకుడు బోయపాటి శ్రీను రెడీ అయిపోతున్నాడట..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలక్రిష్ణ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. టైటిల్ ఇంకా ఖరారు కానీ ఈ మూవీని మే 28న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
అయితే కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాలో ‘అఘోర’గా బాలయ్యను చూపిస్తూ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు బోయపాటి. బాలయ్య కూడా ఆ కొత్త క్యారెక్టర్ లో చాలా ఇష్టపడి నటించాడు. తర్వాత షూటింగ్ ముగిశాక.. అలాంటి పాత్రలో కనిపించడం వద్దు అని బాలయ్య నో చెప్పడంతో.. ఆ అఘోర ఎపిసోడ్ ను ను బోయపాటి పక్కనపెట్టేశాడట..
అయితే అంతా బాగా వచ్చిన సీన్లను పాడు చేయడం ఇష్టం లేక సినిమా అయిపోయిన తరువాత ఎండ్ టైటిల్స్ లో ఈ ఎపిసోడ్ ను చూపించాలని ప్లాన్ చేస్తున్నాడట.. మరీ ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? బాలయ్య అఘోరగా కనిపించడానికి ఓకే చెబుతాడా? అన్నది వేచిచూడాలి.