Mukesh Ambani : అంబానీ గంటకు ఎంత సంపాదిస్తున్నాడంటే.. ఆ డబ్బు తో పుష్ప సినిమా ఈజీగా తీయొచ్చు..

రిలయన్స్ కంపెనీ మనదేశంలో పెట్రో కెమికల్స్, రిఫైనింగ్, గ్యాస్ ఎక్స్ ఫ్లోరేషన్, టెక్స్ టైల్స్, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ వంటి వ్యాపారాలు చేస్తోంది. ముఖేష్ అంబానీ నివాసం ఉంటున్న యాంటీలియా విలువ దాదాపు 15 వేల కోట్ల వరకు ఉంటుందట.

Written By: NARESH, Updated On : May 14, 2024 10:03 pm

Mukesh Ambani Earnings

Follow us on

Mukesh Ambani : మొన్న చిన్న కొడుకు అనంత్ అంబానీ ముందస్తు వివాహ వేడుక కోసం వందల కోట్లను మంచి నీళ్లలాగా ఖర్చు చేశాడు ముకేశ్ అంబానీ. త్వరలో జరిగే పెళ్లి కోసం అంతకుమించి అనే లాగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ముకేశ్ అంబానీ ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎలాగైనా ఖర్చు పెట్టగలడు. ఎంతైనా ఖర్చు పెట్టగలడు. నిజానికి ఆసియా కుబేరుడిగా.. భారత దేశంలోనే అతిపెద్ద శ్రీమంతుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ సంపాదన ఎంత.. అతడు గంటకు ఎంత సంపాదిస్తాడు? మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా.. అయితే ఈ కథనం చదవండి.. మీకు మరింత క్లారిటీ వస్తుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా పగ్గాలు అందుకున్న ముకేశ్ అంబానీ.. అనతి కాలంలోనే పలు అనుబంధ వ్యాపారాలలోకి అడుగుపెట్టాడు.. వాటన్నింటిలోనూ విజయం సాధించాడు. అందువల్లే భారతదేశం లోనే నెంబర్ వన్ శ్రీమంతుడిగా కొనసాగుతున్నాడు. ఆసియాలోనూ టాప్ రిచెస్ట్ మ్యాన్ గా అవతరించాడు. ప్రపంచంలో 11 వ అతిపెద్ద శ్రీమంతుడిగా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నాడు. ఆయన సంపద 106 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 9, 15 , 405 కోట్లు.

ఆ స్థాయిలో డబ్బున్న ముకేశ్ అంబానీ.. గంటకు ఎంత సంపాదిస్తాడో ఐఐఎఫ్ వెల్త్ హురూన్ అనే సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ముఖేష్ అంబానీ గంటకు 90 కోట్లు సంపాదిస్తారట. ఆక్స్ ఫామ్ అనే సంస్థ కూడా ఇదే విషయాన్ని ధ్రువపరిచింది. అక్కడిదాకా ఎందుకు 2020లో దేశం మొత్తం కోవిడ్ విజృంభించినప్పుడు లాక్ డౌన్ విధించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖేష్ గంటకు 90 కోట్ల వరకు సంపాదించారు. ఓ నివేదిక ప్రకారం మనదేశంలో 24 శాతం మంది ప్రజలు నెలకు మూడు వేల లోపే సంపాదిస్తున్నారట.

ఇక ముకేశ్ అంబానీ ఒక గంటకు సంపాదిస్తున్న 90 కోట్లను ఒక సగటు భారతీయుడు సంపాదించాలంటే దాదాపు 17.4 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. స్థూలంగా చెప్పాలంటే సంవత్సరానికి నాలుగు లక్షలు సంపాదించే వ్యక్తి 90 కోట్లు వెనుకేయాలంటే.. దాదాపు 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక మనిషి అన్ని రోజులు బతకడం దాదాపు అసాధ్యం. ఇక ముకేశ్ అంబానీ గంటకు సంపాదిస్తున్న 90 కోట్లతో పుష్ప లాంటి సినిమాను సులభంగా తీయొచ్చు. ఒక సగటు భారతీయుడు అసలు కలలో కూడా కలగనలేని డబ్బు సంపాదిస్తున్న ముఖేష్.. తాను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఏడాదికి 15 కోట్లు మాత్రమే వేతనంగా తీసుకుంటున్నాడు. గంటకు 90 కోట్లు సంపాదించే ముఖేష్ కు.. ఈ 15 కోట్లు లెక్క కాదు. అసలు లెక్కలోదే కాదు. రిలయన్స్ కంపెనీ మనదేశంలో పెట్రో కెమికల్స్, రిఫైనింగ్, గ్యాస్ ఎక్స్ ఫ్లోరేషన్, టెక్స్ టైల్స్, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ వంటి వ్యాపారాలు చేస్తోంది. ముఖేష్ అంబానీ నివాసం ఉంటున్న యాంటీలియా విలువ దాదాపు 15 వేల కోట్ల వరకు ఉంటుందట.