https://oktelugu.com/

Ram Charan : హాలీవుడ్ టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో రామ్ చరణ్… మ్యాటరేంటంటే..?

ఇక ఈ వార్త తెలుసుకున్న చాలా మంది మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 10:07 PM IST

    Ram Charan in the direction of Hollywood's top director... What is the matter..?

    Follow us on

    Ram Charan : హాలీవుడ్ ఇండస్ట్రీలో జేమ్స్ కామెరూన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించడమే కాకుండా విజువల్ వండర్ గా కూడా తెరకెక్కుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన అవతార్ 2 సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇక ప్రస్తుతానికి అవతార్ 3 సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మన తెలుగు హీరోల గురించి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాని చూసిన ఆయన రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోతో హాలీవుడ్ లో సినిమా చేస్తే బాగుంటుందని తెలియజేశాడు. ఇక వీలైతే తనే రామ్ చరణ్ తో ఒక సినిమా చేయచ్చని కూడా అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక తొందర్లోనే రామ్ చరణ్ హీరోగా ‘జేమ్స్ కామెరూన్’ డైరెక్షన్ లో ఒక సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈయన మాటలు విన్న చాలామంది రామ్ చరణ్ తో ఆయన పక్క ఏదో ఒక సినిమా అయితే చేస్తాడు అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    నిజానికి త్రిబుల్ ఆర్ సినిమాలో ఆయనకి రామ్ చరణ్ క్యారెక్టర్ బీభత్సంగా నచ్చేసింది అంట. దానివల్ల ఆయన ఆ సినిమా చూడడానికి అమితమైన ఆసక్తిని చూపిస్తున్నట్టుగా కూడా తెలియజేశాడు. సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాలపైన మోసారని కూడా తను రాజమౌళితో మాట్లాడినపుడు డిస్కస్ చేశాడట.

    ఇక ఆ ఉద్దేశ్యం తోనే రామ్ చరణ్ లాంటి ఒక చరిష్మా ఉన్న యాక్టర్ ని తను డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నట్టుగా వీలైతే తొందర్లోనే అది నెరవేరుతుందని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఈ వార్త తెలుసుకున్న చాలా మంది మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…