AP Elections 2024 : ఏపీ ఓటరు గాలి ఎటువైపు వీచింది..?

అదే సమయంలో, పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మవర్గం, కాపు సామాజికవర్గంలోని కొంత యువత, అలాగే మరికొన్ని అగ్రకులాలు కూటమి వైపు ఉన్నారని అంచనా.

Written By: NARESH, Updated On : May 14, 2024 9:42 pm

Which side will be the verdict of AP voter?

Follow us on

AP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల మహాక్రతువులో.. నాలుగో దశ ముగిసింది. పది రాష్ట్రట్లో 96 లోక్‌సభ స్థానాలకు సోమవారం(మే 13న) పోలింగ్‌ జరిగింది. ఈ సారి పోలింగ్‌ శాతం కాస్త పెరిగింది. 67.70 శాతం పోలింగ్‌ నమోదైంది. అన్నింటికన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 79 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది. ఇక‍్కడ 25 లోక్‌సభ స్థానాలతోపాటు 125 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భారీగా పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో ఓటరు గాలి ఎటు వీస్తుందో తెలియక ఇటు అధికార వైసీపీ, అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి టెన్షన్‌ పడుతున్నాయి. పెగిరిన పోలింగ్‌ ప్రభుత్వ సానుకూలతకు నిదర్శనమని వైసీపీ, ప్రభుత‍్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు ఎవరికి వారు చెబుతున్నారు. గెలుపు తమదే అని పైకి ధీమా ప్రదర్శిస్తున్నా.. లోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. భారీగా పోలింగ్‌ నమోదైనా.. ఫలితాలు విశ్లేషకులకు సైతం అంతు చిక్కడంలేదు. అధికార పార్టీగానీ, విపక్ష కూటమిగానీ గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు.

భారీగా తరలి వచ్చిన ఓటర్లు..
ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి వివిధ రాష్ట్రాల్లో ఉంటున్నవారితోపాటు విదేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు కూడా భారీగా తరలి వచ్చారు. 2014 తరహాలోనే ఈసారి హైదరాబాద్‌ నుంచి సీమాంద్రులు 20 లక్షల మంది ఏపీకి వచ్చారు. 2014లో రాష్ట్రం విడిపోవడంతో కొత్త రాష్ట్ర పునర్నిర్మాణానికి అనుభవజ్ఞుడైన నేత రాష్ట్రానికి అవసరం అన్న ప్రచారంతో ఆంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటువేశారు. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన తరఫున ఎవరూ పోటీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఘోరంగా విఫలం కావడంతో 2019లో ప్రజలు మార్పు కోరుకున్నారు. వైసీపీకి పట్టం కట్టారు.

మళ్లీ కూటమిగా..
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను ఎదుక్కొనేందుకు చంద్రబాబు అవకాశవాద పొత్తులకు తెరలేపారు. 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బాబు.. తర్వాత మోదీతోపాటు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ ఎన్నికల వేళ.. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనలేమని గుర్తించిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ముందుగా పొత్తు పెటు‍్టకున్నారు. తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇక జగన్‌ను ఓడించేందుకు ఏపీలో అభివృద్ధి లేదని, జగన్‌ ఏపీని పదేళుల​ వెనక్కు నెట్టారని, భూముల విలువలు పడిపోయాయని ప్రచారం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారితో తాము జగన్‌ను ఓడించేందుకు ఆంధ్రాకు వెళ్తున్నామని ప్రచారం చేయించారు. సైకో పాలన అంటూ కూటమి ఊదరగొట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేసింది. జగన్‌ ఫ్యామిలీని ఫ్యూడలిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

జగన్‌ వెంటనే పేద, మధ్య తరగతి ఓటర్లు..
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీలోని పేద, మధ్యతరగతికి చెందిన ఓటర్లు, విద్యావంతులైన అర్బన్‌ మిడిల్‌ క్లాస్‌ ఓటరు‍్ల జగన్‌వైపే ఉన్నారని తెలుస్తోంది. రాజధాని పరిధిలోని కొందరు, విశాఖ వాసులు కొందరు కూటమివైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. మహిళలు, మైనారిటీలు, బడుగు బలహీనవర్గాలతోసహా గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీవైపు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణ ఓటర్లు మాత్రం టీడీపీవైపు మొగ్గు చూపారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు వైఎస్ జగన్‌వైపు ఉన్నారు. అదే సమయంలో, పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మవర్గం, కాపు సామాజికవర్గంలోని కొంత యువత, అలాగే మరికొన్ని అగ్రకులాలు కూటమి వైపు ఉన్నారని అంచనా.