PPF:కేంద్రం అదిరిపోయే స్కీమ్.. రూ.1000 పొదుపుతో రూ.3 లక్షలు..?

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ లేకుండా కచ్చితమైన లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీర్ఘకాలం వేచి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పోందడం సాధ్యమవుతుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా 15 సంవత్సరాల తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. […]

Written By: Kusuma Aggunna, Updated On : August 14, 2021 4:56 pm
Follow us on

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ లేకుండా కచ్చితమైన లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీర్ఘకాలం వేచి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పోందడం సాధ్యమవుతుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా 15 సంవత్సరాల తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి చేతికి డబ్బులు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన రాబడి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీరేటును అందిస్తుండటం గమనార్హం. ప్రతి మూడు నెలలకు కేంద్రం ఈ స్కీమ్ వడ్డీరేట్లను సమీక్షిస్తుంది.

ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు ఆదాయపు పన్ను మినహాయింపును కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో 3.25 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం మెచ్యూరిటీ సమయంలో పొందవవచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌ లకు వడ్డీ రేటు స్థిరంగా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు పీపీఎఫ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.