రైతులకు మహీంద్రా కంపెనీ శుభవార్త.. రూ.లక్ష బెనిఫిట్..?

ప్రముఖ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా ట్రాక్టర్ కొనాలని భావించే రైతులకు ఏకంగా లక్ష రూపాయల బెనిఫిట్ ను అందించనుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునే రైతులు సమీపంలోని కంపెనీ షోరూమ్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సులభంగా అర్హత పొందవచ్చు. రైతుల కోసం కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీని అందుబాటులోకి […]

Written By: Kusuma Aggunna, Updated On : May 18, 2021 11:34 am
Follow us on


ప్రముఖ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా ట్రాక్టర్ కొనాలని భావించే రైతులకు ఏకంగా లక్ష రూపాయల బెనిఫిట్ ను అందించనుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలనుకునే రైతులు సమీపంలోని కంపెనీ షోరూమ్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సులభంగా అర్హత పొందవచ్చు.

రైతుల కోసం కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఎం ప్రొటెక్స్ కోవిడ్ ప్లాన్ అయిన ఈ పాలసీ ద్వారా కొత్తగా ట్రాక్టర్ ను కొనుగోలు చేసే రైతులు లక్ష రూపాయల వరకు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ పాలసీ ద్వారా కొత్తగా ట్రాక్టర్ ను కొనుగోలు చేసిన కస్టమర్లు, కస్టమర్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే లక్ష రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు.

ఈ లక్ష రూపాయలతో కరోనా సోకిన వాళ్లు చికిత్స చేయించుకోవచ్చు. కంపెనీ కస్టమర్ల కొరకు ప్రీ అప్రూవ్డ్ రుణాలను కూడా అందిస్తుండటం గమనార్హం. ప్రిఅప్రూవ్డ్ రుణం తీసుకున్న రుణ గ్రహీత మరణిస్తే మహీంద్రా లోన్ సురక్ష కింద తీసుకున్న లోన్ మొత్తానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రైతులకు ఎం ప్రొటెక్ట్ ప్లాన్ కింద ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

కరోనా ప్రతికూల పరిస్థితుల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రైతులకు మేలు జరిగేలా ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. సమీపంలోని షోరూంను సంప్రదించి ఈ ఆఫర్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.