
భారత్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్ వైయూ గ్రాస్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లాంగోన్ సెంటర్ కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలకు సేకరించి వాటిని ల్యాబ్ లో భారత్ లో వెలుగుచూసిన బి. 1.617, బి. 1.618 వేరియంట్లోతో కలిపి పరీక్షించినట్లు పరిశోధనలో సభ్యుడైన నథానియల్ నెడ్ ల్యాండౌ తెలిపారు. ఈ టీకాలు రోగ నిరోదన శక్తిని పెంపొందించేందుకు మూడు నుంచినాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావ వంతంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.