Private Bank Home Loans: ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు.. సొంతంగా స్థలం ఉండాలని మరికొందరు చూస్తారు.. అయితే చేతిలో అనుకున్న ఆదాయం ఉండని నేపథ్యంలో ఒకప్పుడు ఇతరుల వద్ద అప్పు చేసేవారు. ఈ అప్పుకు రూ.2 కంటే ఎక్కువగా వడ్డీని విధించేవారు. కానీ ఇప్పుడు బ్యాంకులు ఇల్లు నిర్మాణంతో పాటు ఇల్లు కొనుగోలు చేసేవారికి రుణాలు అందిస్తున్నాయి. బ్యాంకు ఖాతాదారుడి ట్రాన్జాక్షన్ బట్టి వారికి అవసరమైన లోన్ ను ఇస్తారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణం పొందేందుకు అందరికీ అవకాశం ఉండదు. అంతేకాకుండా ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు. అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read: జీతం 70వేలు.. ELEVEN స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ టీచర్.. వీడియో వైరల్
ప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకోవడం ప్రభుత్వ బ్యాంకుల కంటే సులభం. ప్రైవేట్ బ్యాంకులో రుణం కావాలని ఒక్కసారి కలిస్తే.. ఆ తరువాత వారే వెంటపడి మరీ ఇస్తానంటారు. అంతేకాకుండా కాస్త డాక్యుమెంటేషన్ ఛార్జి తీసుకొని అన్నీ ధ్రువకరణ పత్రాలు వారే తీసుకొస్తారు. లోన్ కావాల్సిన సమయం కంటే కొంచెం ముందుగానే ఇవి మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వారికి కొన్ని ఆఫర్లను కూడా అందిస్తాయి. అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకునేవారు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించారు. అవేంటంటే?
ప్రైవట్ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం చాలా సౌకర్యవంతగానే ఉన్నా.. ఇందులో వడ్డీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే అధికంగా వడ్డీరేటు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ముందుగా తక్కువ వడ్డీ రేటు విధించినా.. ఆ తరువాత ఇతర ఖర్చుల పేరిట పెంచేస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదట్లో తక్కువ వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేసినా.. ఆ తరువాత రకరకాల కారణాల పేరిట ఈ వడ్డీ రేటును పెంచుతారు.
Also Read: గబ్బిలాలతో చికెన్ చిల్లీ.. ఇలా తయారయ్యారేంట్రా.. మీకు పిండం పెట్ట!
ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సార్లు రెపో రేట్లు పెంచుతూ.. తగ్గిస్తూ ఉంటుంది. ఈ ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకులపై వెంటనే ప్రభావం పడుతాయి. అంటే ఆర్బీఐ రెపో రేట్లు తగ్గిస్తే వెంటనే ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీని తగ్గిస్తాయి.. కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం ఈ తీరు భిన్నంగా ఉంటుంది. ఆర్బీఐ రెపోరేట్లు తగ్గిస్తే.. ప్రైవేట్ బ్యాంకులు వెంటనే స్పందించి తగ్గించడానికి ఒప్పుకోవు. అదే రెపోరేట్లు పెంచితే మాత్రం వెంటనే ఈ ప్రభావం వెంటనే రుణం తీసుకునేవారిపై పడుతుంది. అందువల్ల బ్యాంకు లోనే తీసుకునే సమయంలో ఈ విషయాన్ని గమనించాలని కొందరు నిపుణులు అంటున్నారు.
బ్యాంకు రుణం తీసుకునేవారు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ బ్యాంకుల్లోనే తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులో ఇంటి రుణాలపై 7.50 నుంచి 8.45 వడ్డీ శాతం ఉంది. కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో 8.45 నుంచి తగ్గించడం లేదని కొందరు రుణం తీసుకున్నవారు అంటున్నారు.