Bat Meat Chicken Scam: కల్తీ.. కల్తీ.. కల్తీ.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లగా మారాయి రోజులు. ఈ రోజుల్లో ఎందులో చూసినా కల్తీనే. చివరకు కూరగాయలు, పండ్లు, కొబ్బరి నీళ్లు కూడా కల్తీ చేస్తున్నారు. ప్రకృతి మనకు అందించిన సహజమైనవి ఏవీ దొరకడం లేదు. ఇక హోటళ్లలో ఫుడ్ విషయంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. కుళ్లిన మాంసం వండి పెడుతున్నారు. కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో కుక్క మాంసాన్ని మేక మాంసంగా వండిన ఘటన చూశాం. తాజాగా తమిళనాడులో గబ్బిలాలను కోసి.. చికెన్ చిల్లీగా అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. సేలం జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది.
Also Read: 7 వేలతో ఫ్లైట్ తయారీ.. ఎగిరించాడు.. ఇండియాకు దొరికిన ఆణిముత్యం
బయటపడిన గుట్టు..
సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోని తోప్పూర్ రామస్వామి అటవీ ప్రాంతంలో గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని చికెన్‌గా అమ్ముతున్న కమల్, సెల్వంను అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో తుపాకుల శబ్దాలు వినిపించడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుట్టుగా నిఘా పెట్టి ఈ రాకెట్ గుట్టు బయట పెట్టారు. నిందితులు గబ్బిలాలను వేటాడి, వండి, చిల్లీ చికెన్, చికెన్ పకోడీ వంటి వంటకాలుగా స్ట్రీట్ ఫుడ్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఏళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం.
చాలా డేంజర్..
గబ్బిలం ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. గబ్బిలాల నుంచి అనేక వ్యాధులకు మనకు సోకుతున్నాయి. ఇక గబ్బిలాల మాంసాన్ని తినడం ద్వారా వైరల్ సంక్రమణలు వ్యాప్తి చేయబడే ప్రమాదం ఉంది. ఇది ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుంది. అంతేకాకుండా, గబ్బిలాల మాంసం సరైన ఆరోగ్య పరీక్షలు లేకుండా స్ట్రీట్ ఫుడ్‌గా అమ్మబడటంతో వినియోగదారుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది.
Also Read: సిగ్గూ ఎగ్గూ లేదు.. నడిరోడ్డుపైనే ఆ పని.. వీడియో వైరల్
వేట నిషేధం..
గబ్బిలాలు కొన్ని ప్రాంతాలలో రక్షిత జాతులు.. వాటిని వేటాడటం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరం. నిందితులు అటవీ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, ఆహార మోసాల ద్వారా వినియోగదారులను మోసం చేశారు. ఈ ఘటన ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడంతోపాటు, స్థానిక జీవవైవిధ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఇక ఇక్కడ చికెన్ కొనుగోలు చేసి ఇప్పటికే తిన్నవారు ఆందోళన చెందుతున్నారు. ఇలా తయారయ్యారేంట్రా అంటూ మండిపడుతున్నారు.