బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 15 న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.95,180గా ఉంది. ఏప్రిల్ 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,550తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.350 తగ్గింది. దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,330గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.95,180 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,180తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,180తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.95,180తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.99,800గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.100 తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గినా మరింతగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.99,800గా ఉంది. ముంబైలో రూ.99,800, చెన్నైలో రూ.1,09,800 బెంగుళూరులో 99,800, హైదరాబాద్ లో రూ. 1,09,800 తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితులే బంగారం ధరలు తగ్గడానికి కారణం అని తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కొందరు ధరలు ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు. మరికొందరు మాత్రం చెప్పలేం అంటూ వెంటనే కొనుగోలు చేస్తున్నారు. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గడంతో వెండి ఆభరణాలను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. లేకుంటే మళ్లీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు మాత్రం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బంగారం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే లంగ్ టైం ఇన్వెస్ట్ మెంట్ చేయాలని అనుకునవారు మాత్రం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.