Tollywood Heroine : బింబిసారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట బింబిసారా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి విశ్వంభర సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బింబిసారా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మరియు వీడియో గేమ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయ్యిందని సమాచారం. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారు అని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. త్రిష ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. రామ రామ అంటూ సాగే భక్తి గీతాన్ని విశ్వంభర సినిమా నుంచి సినిమా యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పాటకు కీరవాణి బాణీలు అందించారు. ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఒక యంగ్ బ్యూటీ కనిపిస్తుంది. ఈ యంగ్ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టగలరా. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకుంది.మొదట్లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె మరెవరో కాదు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన వాళ్లలో రమ్య పసుపులేటి కూడా ఒకరు. హుషారు సినిమాతో రమ్య పసుపులేటి కి మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెయిన్ హీరోయిన్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తన అందంతో, అభినయంతో రమ్య పసుపులేటి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ చిన్నది ఏకంగా మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో రమ్య పసుపులేటి మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన పాటలో కూడా మెగాస్టార్ పక్కన రమ్య పసుపులేటి డాన్స్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ రెట్టింపు అవ్వడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
View this post on Instagram