Post Office Schemes: పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్స్ వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే పోస్టాఫీస్ లో అకౌంట్ ను కలిగి ఉండి ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
Post Office Schemes
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కు మినిమమ్ డిపాజిట్ అమౌంట్ 250 రూపాయలుగా ఉండనుంది. ప్రతి సంవత్సరం కనీసం 250 రూపాయలు ఈ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. డబ్బులు సరైన సమయంలో చెల్లించని పక్షంలో అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ అకౌంట్ ఫ్రీజ్ అయితే మాత్రం 50 రూపాయలు చెల్లించడం ద్వారా అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
Also Read: మహిళల అభ్యున్నతికి కేసీఆర్ మరిన్ని పథకాలు తేనున్నారా?
నేషన్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కు కనీస డిపాజిట్ 1,000 రూపాయలుగా ఉండనుంది. మార్చి 31వ తేదీలోపు ఈ మొత్తం ఖాతాలో జమ కాని పక్షంలో పెనాల్టీగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెనాల్టీతో పాటు పాయింట్ ఆఫ్ ప్రిసెన్స్ చార్జీలను చెల్లించడం ద్వారా ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
సరైన సమయంలో డబ్బులు డిపాజిట్ చేయడం సాధ్యం కాకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించని పక్షంలో జరిమానా చెల్లిస్తే మాత్రమే అకౌంట్ యాక్టివ్ అవుతుందని చెప్పవచ్చు. డబ్బులు కట్టని పక్షంలో ఖాతా విషయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.
Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?
Recommended Video: