Bigg Boss 9 Winner Pawan Kalyan Padala : అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యుడిగా బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల, నిన్న గ్రాండ్ ఫినాలే లో టైటిల్ విన్నర్ గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఇతను ఎవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. అగ్నిపరీక్ష షో లో సైనికుడిగా పరిచయమైన ఇతను, ఆ షో లో తన ఆకర్షణీయమైన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకున్నాడు. అలా ఆడియన్స్ ఓట్ల ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయన, మొదటి మూడు వారాలు అసలు హౌస్ లో ఉన్నాడు అనే విషయం కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత చెత్తగా గేమ్ ఆడాడు. మూడవ వారం లో తన స్నేహితురాలు ప్రియా తో కలిసి డేంజర్ జోన్ లోకి వచ్చాడు. తృతిలో ఎలిమినేషన్ ని తప్పించుకున్నాడు.
మొదటి మూడు వారాలు ఇతని పై ఆడియన్స్ కి చిరాకు కలిగింది అనే చెప్పాలి. టాస్కులు ఆడలేడు, ఎంతసేపు అమ్మాయిలను పట్టుకోవడం తప్ప ఇతను బిగ్ బాస్ కి ఎందుకు వచ్చాడు వంటి ఆరోపణలు కూడా ఎదురుకున్నాడు. కానీ ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత నుండి పవన్ కళ్యాణ్ అసలు సిసలు ఆట మొదలైంది. ఇమ్మానుయేల్ తో కలిసి కెప్టెన్సీ టాస్కు ఆడి, వరుసగా ఆ వారం మొత్తం గెలుస్తూ రావడం తో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. ఇక ఆ తర్వాతి వారం లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ వెన్నుపోటు పొడుస్తూ కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించడం తో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లి, తనూజ తర్వాత రెండవ స్థానం లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత అతనికి పెద్దగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడకపోయినా, తనూజ తో ఉండడం వల్ల బోలెడంత స్క్రీన్ స్పేస్ దొరికింది.
తనూజ ఎక్కడ ఉంటే తానూ అక్కడ ఉంటూ, ఆమె స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకొని, చాలా బలమైన ఓటు బ్యాంకు ని సంపాదించాడు. ఇక కళ్యాణ్ తనూజ కి సరిసమానంగా తన గ్రాఫ్ ని పెంచుకోవడానికి ఉపయోగపడింది ఫ్యామిలీ వీక్. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పడం, అదే వీకెండ్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తండ్రి మాట్లాడిన గొప్ప మాటలను చూసి, ఆడియన్స్ ఇతన్ని విన్నర్ ని చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. చివరి కెప్టెన్సీ టాస్క్, టికెట్ టు ఫినాలే టాస్కులు గెలవడం తో పవన్ కళ్యాణ్ కి వేరే లెవెల్ ఎలివేషన్స్ వచ్చాయి. 12 వ వారం నుండి ఆయన తనూజ ని ఓటింగ్ లో దాటేసి నెంబర్ 1 స్థానం లో నిల్చున్నాడు. ఇప్పుడు టైటిల్ గెలుచుకొని తన తల్లిదండ్రులను గర్వపడేలా చేసాడు పవన్ కళ్యాణ్. ఇక ఇతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.