https://oktelugu.com/

Prabhas: సాహో’ ఫలితం పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌

Prabhas: ‘సాహో’ ఫలితం పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడంటే…సాహో’లో చిన్నచిన్న లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారని నటుడు ప్రభాస్‌ అన్నారు. ప్రభాస్ లవర్‌ బాయ్‌ రోల్‌ లో నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ నేపథ్యంలో బుధవారం ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ కొంత సమయంపాటు బ్యాక్‌ టు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 3, 2022 / 03:21 PM IST
    Follow us on

    Prabhas: ‘సాహో’ ఫలితం పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడంటే…సాహో’లో చిన్నచిన్న లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారని నటుడు ప్రభాస్‌ అన్నారు. ప్రభాస్ లవర్‌ బాయ్‌ రోల్‌ లో నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ నేపథ్యంలో బుధవారం ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

    Prabhas

    ఈ క్రమంలోనే ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ కొంత సమయంపాటు బ్యాక్‌ టు బ్యాక్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఆ విశేషాలు మీకోసం.. ఓ సినిమా ఓకే చేసేటప్పుడు మీరు పరిగణనలోకి తీసుకునేది ఏమిటి? కథా లేదా హీరో పాత్ర? అని అడిగితే.. ప్రభాస్ మాట్లాడుతూ..సినిమాని అంగీకరించే సమయంలో స్క్రిప్ట్‌ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటా. ఎందుకంటే అదే మన రాతను నిర్ణయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

    Also Read:  ‘సరిగమప’ సింగర్ పార్వతి బయోగ్రఫీ తెలుసా..?

    అన్నట్టు ఆంధ్రలో రాధేశ్యామ్ సినిమా కోసం బయ్యర్లు భారీ రేట్లు పెట్టారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది అయోమయం అయిపోయింది. అయితే, రాధేశ్యామ్‌ యూఎస్ లోని ఐమాక్స్ థియేటర్‌ బుకింగ్స్‌లో కూడా అప్పుడే 70 శాతం టికెట్స్ అమ్ముడు పోయాయి. మొత్తానికి విడుదలకు ముందే రాధేశ్యామ్‌ రికార్డుల వెంట మొదలైనట్టు ఉంది. ఎంతైనా నేషనల్ స్టార్ గా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిపోయింది.

    Prabhas

    రాధేశ్యామ్‌ కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించే యాక్షన్‌ బ్లాస్టర్‌ సలార్‌ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది. మొత్తానికి హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని.. మెయిన్ గా కళ్ళు చెదిరే యాక్షన్స్ తో అబ్బుర పరిచే విజువల్స్ తో ప్రభాస్ ఆకట్టుకుంటాడట.

    Also Read: హిందీలోకి భీమ్లానాయక్.. అక్కడ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

    Tags