https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు..!

ప్రస్తుతం పోస్టల్ శాఖ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడి సొంతమవుతుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. నెలకు కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ కు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2021 / 03:23 PM IST
    Follow us on

    ప్రస్తుతం పోస్టల్ శాఖ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడి సొంతమవుతుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. నెలకు కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

    ఈ స్కీమ్ కు సంబంధించి గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. అయితే ప్రతి నెలా డిపాజిట్ చేస్తే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు కాగా ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకంలో చేరి నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందవచ్చు.

    ఒక వ్యక్తి లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఈ ఖాతాను తీసుకోవచ్చు. మైనర్ల పేరుపై కూడా అకౌంట్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉండగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రుణ సదుపాయం విషయానికి వస్తే ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 50 శాతం రుణంగా పొందే అవకాశం ఉంటుంది. రుణాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు.

    రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతంగా ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టాఫీస్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.