https://oktelugu.com/

Tollywood: చర్చలకు దిగిన రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్… ఆ మూవీ కోసమేనా

Tollywood: ఇద్దరు హీరోలు దాదాపు ఒకే స్టోరీ తో ఉన్న సినిమాలను లేదా ఒకే స్టోరీతో సినిమాలను తెరకెక్కించిన ఘటనలు చూశాం. అయితే ఇప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అదే జరుగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. దీంతో చిత్రసీమలో ఈ స్టోరీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలను గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 9, 2021 3:30 pm
    Follow us on

    Tollywood: ఇద్దరు హీరోలు దాదాపు ఒకే స్టోరీ తో ఉన్న సినిమాలను లేదా ఒకే స్టోరీతో సినిమాలను తెరకెక్కించిన ఘటనలు చూశాం. అయితే ఇప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అదే జరుగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. దీంతో చిత్రసీమలో ఈ స్టోరీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలను గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

    ravi teja and bellamkonda sreenivas is in talks for tiger nageswararo biopic

    బెల్లం కొండ శ్రీనివాస్ కొంత కాలం క్రితం “స్టూవర్ట్ పురం దొంగ” అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీకి కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అయితే మరో వైపు రవితేజ కూడా వంశీ దర్శత్వంలో “టైగర్​ నాగేశ్వర్​రావు” చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్​, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు.

    ఇప్పుడు ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కితే అనే సందేహం అందరికీ కలిగింది. అటు రవితేజ చిత్రబృందానికి, ఇటు బెల్లంకొండ టీమ్‌కు సేమ్ డౌట్ వచ్చిందేమో. అందుకే రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మాస్ మహారాజ్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్, బెల్లంకొండ ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ‘సీత’ సినిమాను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. మరి ఇప్పుడు ఈ చర్చల్లో ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.