https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. ఈ ఖాతా ద్వారా ప్రతి నెలా రూ.5 వేలు పొందే ఛాన్స్?

ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందడానికి ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో మంత్రీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పెళ్లైన వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభంను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2021 / 07:58 PM IST
    Follow us on

    ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందడానికి ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో మంత్రీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పెళ్లైన వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభంను పొందే అవకాశం అయితే ఉంటుంది.

    ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం నూటికి నూరు శాతం సురక్షితమని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించి సింగిల్ అకౌంట్ తో పాటు జాయింట్ అకౌంట్ తెరిచే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ స్కీమ్ లో జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లు 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 5,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

    సంవత్సరానికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 59,400 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 6.6 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఖాతా తెరిచినప్పటి నుంచి మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు వడ్డీని చెల్లిస్తారు. పోస్టాఫీస్ లోని పొదుపు ఖాతాలో ఆటో క్రెడిట్‌ లేదా ఈసీఎస్‌ ద్వారా వడ్డీని విత్ డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    డిపాజిటర్‌ స్వీకరించిన వడ్డీపై పన్నును విధిస్తారని తెలుస్తోంది. మంత్లీ ఇన్‌కమ్‌ ఫారమ్‌ నింపే సమయంలో గుర్తింపుకార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు ఉండాలి. సంబంధిత పోస్టాఫీస్ లో పాస్ బుక్ బుక్ తో పాటు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు.