RTC: టికెట్ల పెంపు వాయిదా వెనుక అసలు కారణమెంటీ?

కరోనా ఎంట్రీతో రవాణారంగం కుదేలైపోయింది. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండంతో రవాణా వ్యవస్థ తిరిగి గాడినపడుతోంది. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని మాత్రం కరోనా మరింత దెబ్బతీసింది. ప్రభుత్వం ఆర్టీసీ గటెక్కించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. దీంతో ఆర్టీసీ టికెట్ల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కరోనా తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రభుత్వం ఓసారి ఆర్టీసీ […]

Written By: NARESH, Updated On : November 8, 2021 7:49 pm
Follow us on

కరోనా ఎంట్రీతో రవాణారంగం కుదేలైపోయింది. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండంతో రవాణా వ్యవస్థ తిరిగి గాడినపడుతోంది. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని మాత్రం కరోనా మరింత దెబ్బతీసింది. ప్రభుత్వం ఆర్టీసీ గటెక్కించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. దీంతో ఆర్టీసీ టికెట్ల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అయితే కరోనా తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రభుత్వం ఓసారి ఆర్టీసీ టికెట్ల రేట్లను భారీగా పెంచింది. ఆర్టీసీ కార్మికులు తమ జీతాలు పెంచాలని కొన్నినెలలపాటు గతంలో ఉద్యమాలు చేపట్టారు. దీనిని ప్రభుత్వం సాకుగా చూపి టికెట్లను పెంచింది. ఈక్రమంలోనే ఆర్టీసీ గాడినపడుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా కరోనా రావడంతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఆర్టీసీ నష్టాల బారిన పడాల్సి వచ్చింది.

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ గట్టెక్కాలంటే టికెట్ల రేట్లు తప్పనిసరిగా అని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సైతం టికెట్ల రేట్ల పెంపునకు సానుకూలతను వ్యక్తం చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు నుంచి దీనిపై కసరత్తులు జరిగాయి. అయితే ఉప ఎన్నిక కారణంగా ఆర్టీసీ టికెట్ల రేట్ల పెంపు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి పాలవడంతో టికెట్ల రేట్లు పెంపు ఖాయమనే టాక్ విన్పించింది.

ఈనెలలోనే టీఆర్ఎస్ విజయగర్జన సభ వరంగల్ లో జరుగనుంది. ఈనెల 15న టీఆర్ఎస్ 20వ వార్సికోత్సవాన్ని పురస్కరించుకొని విజయగర్జన సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ కోసం సుమారు 10లక్షల మందిని తరలించాలని ఆపార్టీ భావిస్తున్నారు. విజయగర్జన సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలకు షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కారణంగానే ఆర్టీసీ టికెట్ల పెంపు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి కారణంగా ఆపార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదేవిధంగా వరి కోనుగోళ్ల విషయంలో జాప్యం కారణంగా రైతుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లను విజయగర్జన సభకు ముందు పెంచినట్లయితే ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ప్రస్తుతానికి టికెట్ల రేట్లు వాయిదా వేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. అయితే విజయగర్జన తర్వాత మాత్రం టికెట్ల రేట్లు పెంచడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.