Post Office Scheme : మీరు పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం అమలులో ఉన్న టైం డిపాజిట్ ఖాతాలపై మంచి వడ్డీరేట్లను పొందవచ్చు. ఆర్.బి.ఐ రెపో రేటు ఈ మధ్యకాలంలో రెండు సార్లు తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును 6.50 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. గణపతి బ్రదర్ ఈ నెలలో సెంట్రల్ బ్యాంకు కూడా మొదట 0.25% నుంచి ఏప్రిల్ నెలలో 0.25 శాతానికి తగ్గించడం జరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు కూడా ప్రజలకు రుణాలను చౌకగా అందిస్తుండడంతో పాటు ఎఫ్డి లపై కూడా వడ్డీరేట్లను భారీగా తగ్గించేసాయి. మరోవైపు పోస్ట్ ఆఫీస్ వారు పొదుపు ఖాతాలపై వినియోగదారులకు అధిక రాబడినీ అందిస్తున్నారు.
Also Read : ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు.. ఖతాదారులకు కేంద్రం శుభవార్త!
మీరు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అద్భుతమైన పథకం టైం డిపాజిట్ పథకంలో మూడు లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.44,664 స్థిర వడ్డీ అందుకోవచ్చు. టిడి పథకంలో పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడికి 6.9 శాతం నుంచి 7.5% వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది మీరు టిడి పథకంలో 6.90 శాతం వడ్డీని అలాగే రెండేళ్లకు టిడి పథకంలో 7.0% వడ్డీని అలాగే మూడేళ్లకు టిడి పథకంలో 7.1% వడ్డీని ఇక ఐదు ఏళ్లకు టిడి పథకంలో 7.5% వడ్డీని పొందవచ్చు. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టైం డిపాజిట్ పథకంలో రెండేళ్ల కాలపరిమితికి 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.3,44,664 వడ్డీతో కలిపి పొందవచ్చు.
మీకు ఇందులో రూ.44,664 స్థిర వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న టైం డిపాజిట్ పథకం కూడా బ్యాంకులో అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకం లాగానే ఉంటాయి. మీరు టైం డిపాజిట్ పథకంలో నిర్నిత కాల వ్యవధిలో హామీతో కూడిన స్థిర వడ్డీని పొందవచ్చు. సాధారణ పౌరుల కన్నా కూడా బ్యాంకులు సీనియర్ సిటిజనులకు 0.5 శాతం ఎక్కువ వడ్డీని ఎఫ్డి పై అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ వారు సీనియర్ సిటిజనులకు అదనపు వడ్డీని ఇవ్వవు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టైం డిపాజిట్ పథకంలో అన్ని వయసులో వినియోగదారులు కూడా ఒకే రకమైన వడ్డీని పొందవచ్చు.