Homeబిజినెస్EPF Interest Rate : ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు.. ఖతాదారులకు కేంద్రం శుభవార్త!

EPF Interest Rate : ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు.. ఖతాదారులకు కేంద్రం శుభవార్త!

EPF Interest Rate  : ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ప్రతిపాదించిన గత రేటు 8.25 శాతాన్నే ఈసారి కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరు ఆమోద ముద్ర వేసింది. 2023–24 సంవత్సరంలో కూడా ఇదే వడ్డీ రేటు అమలులో ఉంది. ఈ నోటిఫికేషన్‌తో, సుమారు 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ కానుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని, రిటైర్మెంట్‌ పొదుపు పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాలెన్స్‌ చెక్‌ చేసే సులభ మార్గాలు
ఈపీఎఫ్‌ నిల్వలు, వడ్డీ జమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి చందాదారులు వివిధ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఉమాంగ్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయి, ఈపీఎఫ్‌ సర్వీసెస్‌ విభాగంలో యూఏఎన్, ఓటీపీ ఎంటర్‌ చేస్తే బ్యాలెన్స్, పాస్‌బుక్‌ వివరాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే, www.epfindia.gov.in వెబ్‌సైట్‌లో యూఏఎన్, పాస్‌వర్డ్‌ ఉపయోగించి పాస్‌బుక్‌ వివరాలు చూడవచ్చు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి 9966044425కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్‌ ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తుంది. లేదా, 7738299899కు “EPFOHO UAN’ అని ఎస్సెమ్మెస్‌ పంపితే కూడా వివరాలు లభిస్తాయి.

Also Read : అద్భుతమైన బిజినెస్ ఐడియా.. పెట్టుబడి లేకుండా ఇంట్లో కూర్చొని లక్షల్లో సంపాదించవచ్చు..

చందాదారులకు మరిన్ని సౌలభ్యాలు
ఈపీఎఫ్‌వో సేవలను డిజిటలైజ్‌ చేయడం ద్వారా చందాదారులకు సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆన్‌లైన్‌ పాస్‌బుక్, బ్యాలెన్స్‌ చెక్, విత్‌డ్రాయల్‌ సౌకర్యాలు చందాదారులకు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈపీఎఫ్‌ నిల్వలపై స్థిరమైన వడ్డీ రేటు ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు కొనసాగడం ద్వారా, చందాదారులు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు మరింత ఊతం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version