Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. తక్కువ పెట్టుబడితో రూ.4 లక్షల లాభం పొందే ఛాన్స్!

Post Office Scheme: మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉన్నా అదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం […]

Written By: Kusuma Aggunna, Updated On : March 16, 2022 4:40 pm
Follow us on

Post Office Scheme: మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉన్నా అదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

Post Office Scheme

ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత పొందే మొత్తంపై మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ముందుగానే తీసుకోవాలంటే మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read: Pavan Kalyan: ప‌గ‌డ‌పు ఉంగ‌రం పెట్టిన ప‌వ‌న్‌.. ఇక సీఎం అవ్వ‌డం ఖాయ‌మేనా..?
డిపాజిటర్ మరణించిన సమయంలో, కోర్టు ఆదేశాలు వచ్చిన సమయంలో ఈ స్కీమ్ ద్వారా డబ్బులను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత ఏకంగా 14 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా రూ.4 లక్షల లాభం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

నెలవారీ ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: Hijab Controversy: హిజాబ్ వివాదం.. ఎవరిది రైట్? ఎవరిది రాంగ్?