పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.2 వేలు కడితే రూ.లక్షా 40 వేలు!

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో చేరడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండానే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. స్కీమ్ ప్రాతిపదికన మనకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. అందువల్ల స్కీమ్ ను ఎంచుకునే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం డబ్బు చెల్లించే స్థోమత ఉన్నవాళ్లు రికరింగ్ డిపాజిట్ […]

Written By: Navya, Updated On : July 9, 2021 11:27 am
Follow us on

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో చేరడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండానే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. స్కీమ్ ప్రాతిపదికన మనకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. అందువల్ల స్కీమ్ ను ఎంచుకునే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ప్రతి నెలా కొంత మొత్తం డబ్బు చెల్లించే స్థోమత ఉన్నవాళ్లు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ను ఎంచుకున్న వాళ్లు నిర్ణీత కాలం వరకు డబ్బులు చెల్లిస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత ఒకేసారి డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం వల్ల రిస్క్ ఉండకపోవడంతో పాటు కచ్చితమైన లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ప్రస్తుతం 5.8 శాతం వడ్డీని అందిస్తుండటం గమనార్హం.

ఈ స్కీమ్ లో నెలకు 2,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 1,40,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఐదు సంవత్సరాల వరకు డబ్బులను కడుతూ వెళ్లాలి. ఐదు సంవత్సరాల వరకు 1,20,000 రూపాయలు చెల్లిస్తే వడ్డీ రూపంలో ఏకంగా 20,000 రూపాయలు లభిస్తాయి. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లు ఎక్కువ డబ్బులు కడితే భారీగా రాబడి వస్తుంది.

పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఏ స్కీమ్ ను ఎంచుకున్నా ఆ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.