https://oktelugu.com/

156 ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ కు నోటిఫికేషన్.. భారీ వేతనంతో..?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియోలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ హెడ్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 1వ తేదీ వరకు ఈ […]

Written By: , Updated On : July 9, 2021 / 11:24 AM IST
Follow us on

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియోలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ హెడ్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగష్టు 1వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారు మహారాష్ట్రలోని పుణెలో పని చేయాల్సి ఉంటుంది. https://www.tropmet.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 156 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 55, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 2, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ 1, ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ 1, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 33, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది.

వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉండటం వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.