Post Office Insurance Policy: ప్రస్తుత కాలంలో జీవిత బీమా ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరంగా మారిందనే సంగతి తెలిసిందే. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగిన సమయంలో జీవిత బీమా వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు ప్రైవేట్ రంగ కంపెనీలు సైతం ఎన్నో జీవిత బీమా పాలసీలను అందిస్తుండటం గమనార్హం. అయితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందాలనుకునే వాళ్లకు పోస్ట్ జీవిత బీమా పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు.
పోస్ట్ జీవిత బీమా పాలసీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వ రక్షణ ఉంటుంది. 1884 సంవత్సరం నుంచి దేశంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆరు రకాల పాలసీలను అందిస్తోంది. 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు పోస్ట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవచ్చు. కనీస బీమా మొత్తం 20,000 రూపాయలు కాగా గరిష్ట బీమా మొత్తం 50 లక్షల రూపాయలుగా ఉంది.
పాలసీని తీసుకున్న 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు 1,000 రూపాయలకు 76 రూపాయల బోనస్ ను చెల్లించాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి నెలకు 2,200 రూపాయల చొప్పున 25 సంవత్సరాలకు ప్రీమియం చెల్లిస్తే 29 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. 10 లక్షల రూపాయల పాలసీపై 29 లక్షల రూపాయలు పొందవచ్చు.
అవసరమైతే 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. పాలసీ సమయంలో హోల్డర్ చనిపోతే నామినీ మరణం యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.