Post Office FD : ఆర్బిఐ రేపో రేటును తగ్గించిన తర్వాత అన్ని బ్యాంకులు కూడా తమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు కూడా తగ్గించాయి. కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం తన వినియోగదారులకు గతంలో లాగానే అవే వడ్డీ రేటును కల్పిస్తుంది. ఆర్బిఐ రేపో రేటును తగ్గించినప్పటికీ పోస్ట్ ఆఫీస్ మాత్రం తన పొదుపు స్కీం లపై వడ్డీ రేట్లు మాత్రం తగ్గించలేదు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలపై పోస్ట్ ఆఫీస్ తన వినియోగదారులకు 6.9% నుంచి 7.5% వరకు మునపటి లాగానే వడ్డీ రేటును కల్పిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతం ఉన్న టిడి పథకం బ్యాంకులో లో ఉన్న ఎఫ్డి పథకం లాగానే ఉంటుంది. నిర్ణీత సమయం తర్వాత ఈ పథకంలో స్థిరరాబడి అందుతుంది.
Also Read : పోస్ట్ ఆఫీస్ లో రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు పొందే అద్భుతమైన పథకం…
తన వినియోగదారులకు పోస్ట్ ఆఫీస్ శాఖ వారు ఒక ఏడాది టిడి పథకం పై 6.9 శాతం వడ్డీని అలాగే రెండేళ్లు టిడి పథకం పై 7.0% వడ్డీని ఇక మూడేళ్లు టిడి పథకం పై 7.1 శాతం వడ్డీని అలాగే ఐదేళ్లు టిడి పథకం పై 7.5% వడ్డీని కల్పిస్తుంది. విశేషమేమిటంటే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టిడి పథకంలో ఆ వ్యక్తి సీనియర్ పౌరుడైన లేదా సాధారణ పౌరుడైన అలాగే పురుషుడైనా లేదా స్త్రీ అయినా కూడా వడ్డీ రేటు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టిడి పథకంలో రెండేళ్లలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయం తర్వాత మీరు ఎంత మొత్తంలో డబ్బు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము.
అయితే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టిడి పథకంలో మీరు మీ భార్య పేరు మీద పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. టిడి పథకంలో పోస్ట్ ఆఫీస్ వారు రెండేళ్లకు 7.0 శాతం వడ్డీని కల్పిస్తున్నాయి. ఒకవేళ ఈ పథకంలో మీరు మీ భార్య పేరు మీద ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.1,14,888 మీ భార్య ఖాతాలో జమ చేయబడుతుంది. మీరు పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలతో పాటు అదనంగా మీరు రూ.14,888 వడ్డీగా పొందుతారు. పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న అన్ని పథకాలు కూడా చాలా సురక్షితమైనవి. ఈ పొదుపు పథకాలలో మీ డబ్బు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది అన్న సంగతి చాలామందికి తెలిసిందే.