Portable ACs: ఇక అద్దెకు ఇంట్లో ఉండేవారు వారికి ఏసీ పెట్టుకోవడం చాలా పెద్ద సమస్య అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ని అమర్చాలంటే ఇంటి యజమానికి మరియు అద్దెకు ఉంటున్న వారికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంటి యజమానులు కొంతమంది ఏసిని అమరచడానికి గోడకు రంధ్రాలు కొట్టడానికి అస్సలు ఒప్పుకోరు. ధనిక కుటుంబాలతోపాటు మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసి సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే సొంతంగా ఇల్లు ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ అదే ఇంట్లో ఉంటున్న వాళ్లు మాత్రం తమ ఇంట్లో ఏసిని అమర్చుకోవడానికి ఇంటి యజమాని అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: కష్టాలు రాకుండా ఉండాలంటే.. విదురనీతి ఏం చెబుతుందంటే?
ఈ క్రమంలో ఏ సిని అమర్చడానికి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి మరియు ఇంటి యజమానికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. కొంతమంది ఇంటి యజమానులు గోడకురందరాలు కొట్టడానికి కూడా ఒప్పుకోరు. ఈ క్రమంలో సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి కొత్త తరహా ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏసీల కోసం గోడకు రంధ్రాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఇల్లంతా చల్లగా మారిపోతుంది. ఇవి కూలర్ లాంటి పరిమాణంలోనే ఉంటాయి. వీటిని పోర్టబుల్ ఏసి అంటారు. ఇల్లంతా ఇవి మంచి కూలింగ్ ఇస్తాయి. ఒక గది నుంచి మరొక గదికి కూడా సులభంగా తీసుకొని వెళ్లొచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలో అడ్జస్ట్రబుల్ పైప్లైన్ కలిగి ఉండడంతో అవి వేడి గాలిని బయటకు పంపించేసి ఇంట్లో చల్లదనాన్ని క్షణాల్లో అందేలా చేస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీలలో కూడా గోడకు పెట్టే ఏసీ లాగానే వన్ టన్, 1.5 టన్ మరియు 2 టన్ అనే రకాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రముఖ కంపెనీలు పోర్టబుల్ ఏసీలను సామాన్య ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో 1 టన్ పోర్టబుల్ ఏసీ ధర రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు అందుబాటులో ఉంది. అలాగే 2 టన్ పోర్టబుల్ ఏసీల ధర రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని గోడకు రంధ్రాలు పెట్టి అమర్చాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంట్లోనే ఒక గది నుంచి మరొక గదికి ఈ ఏసీని సులభంగా తీసుకొని వెళ్లొచ్చు.
Also Read: హైదరాబాద్ వెరీ కాస్ట్లీ…రూ. 31,000 లేనిదే జీవితం సాగదు.. కారణం ఇదే..