Vidura Niti: అందమైన జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు తమ జీవితం గురించి ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం పెద్దరాజు సలహా ద్వారా తమ లైఫ్ ను చక్కబెట్టబోతుంటారు. అయితే పూర్వకాలంలో కొందరు పెద్దలు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? కష్ట సమయంలో ఎలా ఉండాలి? ఆపద వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను చెప్పారు. వీరిలో విదురుడు ఒకరు. మహాభారతంలో మహాత్మా విదురుడు ముఖ్యమైన వ్యక్తి. ఆయన చెప్పిన నీతి వాక్యాలు ఇప్పటికే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను విదురుడు ఎలా చెప్పాడంటే?
Also Read: బ్లూ మూన్, సూపర్ మూన్, హార్వెస్ట్ మూన్, బ్లడ్ మూన్ మధ్య తేడా తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని కొందరు మాత్రమే ఎదురుకోవడానికి సిద్ధమవుతారు. కానీ కొందరు మాత్రం ఆ కష్టాలను చూసి భయపడుతూ ఉంటారు. కొందరు ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. అయితే విదుర నీతి ప్రకారం ఒక వ్యక్తి కష్టాల నుంచి బయట పడాలంటే తెలివి సంపాదించుకోవాలని చెబుతాడు. ఎందుకంటే తెలివైన వ్యక్తి కొన్ని విషయాల పట్ల పగడ్బందీగా ఉంటూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ ఉంటాడని విదురనీతి చెప్తుంది.
విదుర నీతి ప్రకారం ఒక తెలివైన వ్యక్తికి ప్రేమ, ద్వేషం విషయంలో ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తాను ప్రేమగా ఉన్నప్పుడు ఒకలా.. ద్వేషం వచ్చినప్పుడు మరోలా ప్రవర్తించడం వల్ల కష్టాలను ఎదురుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికీ ఒకే మాదిరిగా ఉండడంవల్ల అన్ని పరిస్థితులను ఒకే లాగా అంచనా వేయవచ్చు. దీంతో ఎటువంటి మానసిక ఇబ్బందులు ఉండవని విదురనీతి చెబుతుంది.
కష్టాలు రాకుండా ఉండాలంటే డబ్బు విషయంలో ఎక్కువగా కోరికలు ఉండొద్దని విదుర నీది చెబుతుంది. ఎందుకంటే డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది. డబ్బు వచ్చినప్పుడు ఎగిసి పడకుండా.. లేనప్పుడు బాధపడకుండా ఉండొద్దని.. డబ్బు కంటే మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ముఖ్యమని చెబుతూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఒకే మాదిరిగా ప్రవర్తించాలని విదురనీది చెబుతోంది. కాలాలను బట్టి ఆహారాలను మారుస్తూ పోతే శరీరం ఆందోళనగా మారుతుందని.. నీతో అనేక రోగాలు కొనితెచ్చుకున్న వారవుతారని చెబుతున్నారు. ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ఉంటూ.. ఆరోగ్య అలవాట్లు పాటించడం వల్ల కష్టాలు రాకుండా ఉంటాయని విదురనీతి చెబుతుంది..
కష్టాలు రాకుండా ఉండాలంటే అందరి విషయంలో ఒక విధంగా ప్రవర్తించాలని విదుర నీతి చెబుతుంది. ఒకరితో ఒకలాగా.. మరొకరితో మరోలాగా ఉండటం వల్ల.. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో సమాజంలో అందరూ దూరమయ్యే అవకాశం ఉంటుందని.. అప్పుడు ఒంటరిగా మిగిలిపోయా ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందువల్ల విదుర నీతి ప్రకారం సమాజంలో అంతా ఒకటే అనే భావనతో ఉండాలని అంటున్నారు. అలాగే మనసులోని ఆలోచనలు ఎప్పుడూ ఒకే లాగా ఉండాలని విదుర నీది చెబుతుంది. ఆలోచనలతోనే జీవితం మారుతుందని అంటున్నారు.